ఎక్స్ ప్రెస్ హైవేలో వెంటాడి మహిళపై కాల్పులు
న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై మండిపడిన ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు వెంటాడి ఆమె మీద తుపాకులతో కాల్పులు జరిపిన దారుణ సంఘటన ఢిల్లీ -గుర్గావ్ ఎక్స్ ప్రెస్ హై వేలో జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు.
పోలీసు అధికారుల కథనం మేరకు ఆదివారం అర్దరాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో వెలుతున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ తో పాటు ఇద్దరు మహిళలు కారులో ఉన్నారు.
మార్గం మధ్యలో ఓ పబ్ దగ్గర ముగ్గురు దుండగులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనితో కారులో ఉన్న మహిళ ఎదురు తిరిగి దుండగుల మీద మండిపడింది. ఆ సందర్బంలో మీ అంతు చూస్తామని చెప్పిన దుండగులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.

తరువాత మరో ఇద్దరు నిందితులను వెంట పెట్టుకుని విలాసవంతమైన కారులో మహిళలు వెలుతున్న స్కార్పియో కారును ఎక్స్ ప్రెస్ హై వే మీద వెంబడించారు. ఐఫ్కో చౌక్ దగ్గర బేస్ బాల్ బ్యాట్ లతో స్కార్పియో కారు అద్దాలు పూర్తిగా ద్వంసం చేశారు.
తుపాకులు తీసుకుని కారులో ఉన్న సిద్దాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి వచ్చిన కారులో తప్పించుకుని పారిపోయారు. తీవ్రగాయాలైన సిద్దాంత్, దేవిశ్రీ గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications