వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌, అసోం, కేరళలో మళ్లీ అధికార పార్టీలే- తమిళనాడు, పుదుచ్చేరిలో విపక్షాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్‌ ప్రకారం పశ్చిమబెంగాల్, కేరళ, అస్సోంలో అధికార పార్టీల హవా కొనసాగుతుండగా.. తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం విపక్షాలు సత్తా చాటుకుంటున్నాయి. పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కును కూడా దాటేశాయి. దీంతో ఫలితాలపై దాదాపు స్పష్టత వచ్చేసినట్లయింది.

Recommended Video

#ElectionResult : Kerala లో చరిత్ర WB అస్సోంలో అధికార పార్టీలే.. Tamil Nadu లో DMK | Oneindia Telugu
 ఐదు రాష్టాల్లో గెలుపు గుర్రాలివే

ఐదు రాష్టాల్లో గెలుపు గుర్రాలివే


పశ్చిమబెంగాల్, అస్సోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇందులో బెంగాల్, అస్సోం, కేరళలో అధికార టీఎంసీ, బీజేపీ, ఎల్‌డీఎఫ్‌ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తున్నాయి. అటు తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం అధికార అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ చతికిలపడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో విపక్ష డీఎంకే, బీజేపీ-ఎన్నార్‌ కాంగ్రెస్ అధికారం చేపట్టేలా వాతావరణం కనిపిస్తోంది.

బెంగాల్లో తృణమూల్ ధాటికి బీజేపీ చిత్తు

బెంగాల్లో తృణమూల్ ధాటికి బీజేపీ చిత్తు

కరోనా పరిస్ధితుల్లో ఎనిమిది దశల్లో సాగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అదేమీ లేదని ఫలితాల సరళి చెబుతోంది. ఉదయం నుంచి తృణమూల్‌ అభ్యర్ధులు మెజార్టీ స్దానాల్లో ఆధిక్యాల్లో దూసుకుపోతున్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌ అధికారం చేపట్టేందుకు అవసరమైన 148 సీట్ల మ్యాజిక్ మార్కును అలవోకగా దాటేసింది. బీజేపీ మాత్రం 100 లోపు సీట్లతో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంత హవాలోనూ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్‌లో వెనుకబడటం టీఎంసీ నేతల్ని కలవరపెడుతోంది.

అస్సోంలో బీజేపీదే హవా

అస్సోంలో బీజేపీదే హవా

దేశంలో తొలిసారి ఎన్నార్సీ అమలు చేసిన రాష్ట్రం అస్సోంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నార్సీ వ్యతిరేకతను అధిగమించి మరీ బీజేపీ ఇక్కడ ఫలితాలు సాదిస్తున్నట్లు ట్రెండ్స్‌ సూచిస్తున్నాయి. 126 సీట్ల అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 64 సీట్ల మ్యాజిక్‌ మార్కు అవసరం ఉంది. కానీ ఇప్పటికే బీజేపీ కూటమి 80 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్‌ కూటమి మాత్రం 40 సీట్లకే పరిమితమవుతోంది. దీంతో బీజేపీ ఎన్నార్సీ అమలు చేసినా వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

కేరళలో మరోసారి ఎర్రజెండా రెపరెపలు

కేరళలో మరోసారి ఎర్రజెండా రెపరెపలు

అటు కేరళలోనూ ఎల్డీఎఫ్‌ కూటమికి ప్రజలు భారీగా ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించిన లెఫ్ట్ ఫ్రంట్‌ ఇక్కడ 140 స్ధానాల్లో ఇప్పటికే 92 స్ధానాలు సాధించి మ్యాజిక్ మార్కును కూడా అందుకుంది. విపక్ష యూడీఎఫ్‌ కూటమి 45 స్ధానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ కేవలం 3 స్దానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో మరోసారి పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష కూటమి సర్కారు ఏర్పడబోతోంది. కేరళలో వరుసగా రెండోసారి అధికారం అందుకున్న రికార్డు కూడా విజయన్ సాధించనున్నారు.

తమిళనాట సూర్యోదయం

తమిళనాట సూర్యోదయం

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య సాగిన పోరులో డీఎంకే పైచేయి సాధించింది. అందరూ ఊహించినట్లుగానే డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి మెజార్టీ స్ధానాల్లో సత్తా చాటుకుంటోంది. ఇప్పటివరకూ ఈ కూటమి 135 స్ధానాల్లో ఆధిపత్యం ప్రదర్సిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కేవలం 98 స్దానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తగినట్లుగా డీఎంకే కూటమి ప్రదర్శన లేకపోవడం విశేషం. డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి సహా ప్రధాన నేతలంతా ఆధిక్యాల్లోనే ఉన్నారు. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పుదుచ్చేరిలో కాషాయ వెలుగులు

పుదుచ్చేరిలో కాషాయ వెలుగులు

పుదుచ్చేరిలో తమకు అందని ద్రాక్షగా ఉన్న అధికారాన్ని ఎలాగైనా అందుకునే లక్ష్యంతో స్దానిక ప్రాంతీయ పార్టీ ఎన్నార్ కాంగ్రెస్‌తో జతకూడిన బీజేపీ.. అందుకు తగ్గ ఫలితాల్ని అందుకుంటోంది. 30 సీట్లున్న పుదుచ్చేరిలో బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 12 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి మాత్రం నాలుగు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే బీజేపీ తొలిసారి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
5 State Assembly Election Results: as per the latest trends ruling parties in west bengal, kerala, assam will retain power and oppostion parties may gain in tamilnadu and puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X