వామ్మో.. ఇదేంది.. 50 శాతం మంది మాస్క్ ధరించడం లేదు.. 64 శాతం మంది ఇలా..
కరోనా మన దరి చేరొద్దు అంటే మాస్క్ శ్రీరామ రక్ష. మాస్క్ ఉంటేనే వైరస్ మన వద్దకు రాదు. ఆ తర్వాత శానిటైజర్ కూడా ఇంపార్టెంట్.. అయితే దేశంలో ఇప్పటికీ సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సగం మంది అస్సలు మాస్కు వేసుకోవడం లేదని చెప్పింది. మాస్కు వేసుకున్న వారిలో 64 శాతం మంది ముక్కును కవర్ చేసుకోవడం లేదని చెప్పింది.
ఎనిమిది రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. 9 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులు ఉండగా, 19 రాష్ట్రాల్లో 50 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా 25 శాతం తీవ్రత కనిపిస్తూనే ఉంది. ఫిబ్రవరి మధ్య నుంచి ఇండియాలో 2.3 రెట్లు కరోనా తీవ్రత పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. 10 వారాలుగా కొవిడ్ పాజిటివిటీ పెరుగుతుండగా రెండు వారాలుగా కాస్త తగ్గుతున్నట్లుగా కనిపించిందని చెప్పింది.

Recommended Video
ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ పాజిటివిటీ 210గా నమోదైన కేసులలో మే 13 నుంచి 19 వరకూ 303 అయ్యాయి. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ 25 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ అనేది 15 శాతం కంటే ఎక్కువగానే ఉందని వెల్లడించింది. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ల వాడకం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకుని ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చని చెప్పింది.












Click it and Unblock the Notifications