వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

51 ఏళ్ళ వయసులోనూ లైంగిక వేధింపులు .. 66మంది మహిళలు, బాలికల ఫిర్యాదుతో యూపీ వ్యక్తి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన 51 సంవత్సరాల వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు వివాహితులైన కొడుకుల తండ్రి లైంగిక వాంఛతో రగిలిపోతూ వంద మందికి పైగా మహిళలు, బాలికలను వేధించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనిపై 66 కి పైగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు రావడంతో 51 ఏళ్ల రాజేష్ కుమార్ ను ఔరియా ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు.

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

మొబైల్ ఫోన్లకు కాల్ చేసి అశ్లీల సంభాషణ , పాటలు పాడే వ్యక్తి

మొబైల్ ఫోన్లకు కాల్ చేసి అశ్లీల సంభాషణ , పాటలు పాడే వ్యక్తి

ఔరియా జిల్లాలోని బేలా పోలీస్ సర్కిల్ పరిధిలోని జీవా సర్సాని గ్రామంలో నివసిస్తున్న రాజేష్ కుమార్ మహిళలను, బాలికలను వేధింపులకు గురి చేయడం పనిగా పెట్టుకున్నాడు. నిందితుడు మహిళలు మరియు బాలికలకు వారి మొబైల్ ఫోన్లకు కాల్ చేసి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అశ్లీల పాటలు పాడటం , అశ్లీల చాట్ చేయడం ద్వారా వారిని వేధిస్తారు . అంతేకాదు వారికి ఇష్టం లేకున్నా అసభ్యకరమైన పాటలు వినడానికి మరియు అతనితో అసభ్యకరమైన చాట్‌ చెయ్యాలని ఇబ్బంది పెడతాడు .

 66 మంది మహిళలు మరియు బాలికలు ఫిర్యాదు .. అరెస్ట్ చేసిన పోలీసులు

66 మంది మహిళలు మరియు బాలికలు ఫిర్యాదు .. అరెస్ట్ చేసిన పోలీసులు

వివిధ జిల్లాల నుండి దాదాపు 66 మంది మహిళలు మరియు బాలికలు అతనిపై ఫిర్యాదు చెయ్యటంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకున్నారు .

లక్నోలోని ఉమెన్ పవర్ లైన్‌కు కాల్ చేసి అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజేష్ కుమార్ గుట్టు రట్టు చేశారు. అంతేకాదు బ్లాక్ మెయిల్‌కు భయపడి పోలీసుల వద్దకు వెళ్ళని బాధితులు ఇంకా ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజేష్ కుమార్ చేసిన మొదటి దుర్మార్గం 2018 సంవత్సరంలో రిపోర్ట్ చేయబడింది, ఒక మహిళ ఉమెన్ పవర్ లైన్ నంబర్ వద్దకు వచ్చి అతనిపై ఫిర్యాదు చేసింది.

కాల్ డేటా ఆధారంగా పట్టుకున్న పోలీసులు

కాల్ డేటా ఆధారంగా పట్టుకున్న పోలీసులు

ఔరయా పోలీసులు, డయల్ 1090 బృందంతో కలిసి, అతని ఫోన్ యొక్క సిడిఆర్ (కాల్ వివరాలు రికార్డ్) వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

లక్నోలోని బేలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, మరియు ఇన్స్పెక్టర్ ఉమెన్ పవర్ లైన్ నేతృత్వంలోని బృందం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు రాజేష్ కుమార్ ను అరెస్టు చేసింది. పోలీసు సూపరింటెండెంట్ ఔరయా , అపర్ణ గౌతమ్, సాంకేతిక విచారణ ఆధారంగా లక్నోలోని బేలా పోలీసులు మరియు ఉమెన్ పవర్ లైన్ సంయుక్త బృందం ఉమెన్ పవర్ లైన్ నుండి పొందిన వివరాలు నిందితుడి స్థానాన్ని గుర్తించి, అరెస్ట్ చేశామని వెల్లడించారు.

నిందితుడు 51 ఏళ్ళ వయసున్న ఒక రైతుగా గుర్తింపు

నిందితుడు 51 ఏళ్ళ వయసున్న ఒక రైతుగా గుర్తింపు

ఇన్ స్పెక్టర్ బేలా పప్పు సింగ్ మాట్లాడుతూ, రాజేష్ , వృత్తిరీత్యా ఒక రైతు, ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని అతను వ్యక్తిగత సంతృప్తి కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది బాలికలను మరియు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశారని వెల్లడించాడు.

ఫిర్యాదుదారులు పోలీసులకు నిందితుడు ఉపయోగిస్తున్న రెండు నంబర్ల నుండి నిరంతర కాల్స్ మరియు సందేశాలు పంపేవారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో అతని ఫోన్లలో 200 మందికి పైగా మహిళల పరిచయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు , చాలా సిమ్ లు స్వాధీనం చేసుకున్నారు .

పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు .. గతంలో యూపీలో ఒక ఉద్యోగి కూడా ఇలానే

పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు .. గతంలో యూపీలో ఒక ఉద్యోగి కూడా ఇలానే

ఒక అమ్మాయి లేదా మహిళను ఎంచుకుంటే, అతను ఆ నెంబరును సేవ్ చేసుకుని వేధింపులకు గురి చేస్తాడని పోలీసులు వెల్లడించారు.

ఉమెన్ పవర్ లైన్ ఇన్స్పెక్టర్, అజయ్ పాల్, "అతను 2018 నుండి బాలికలను మరియు మహిళలను వేధిస్తున్నాడని , అతనిపై ఫిర్యాదు వెల్లువగా మారడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతనిపై సెక్షన్ 354 డి 2 , సెక్షన్ 294 , సెక్షన్504 మరియు ఐపిసి యొక్క 507 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లుగా వెల్లడించారు.
గతంలో ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగి కూడా సుమారు 50 మంది మైనర్ లను లైంగిక వేధింపులకు గురి చేసి కటకటాలపాలయ్యారు .

పనిస్తామని తీసుకెళ్ళి .. 13 నెలలు బందీగా గ్యాంగ్ రేప్ .. నరకం చూసిన నేపాలీ బాలికపనిస్తామని తీసుకెళ్ళి .. 13 నెలలు బందీగా గ్యాంగ్ రేప్ .. నరకం చూసిన నేపాలీ బాలిక

English summary
After over 66 complaints, police have arrested a 51-year-old man for harassing women and girls across Uttar Pradesh. Two cell phones and multiple SIMs were seized from his possession.The accused, Rajesh Kumar, father of three married sons, was arrested from Aurraiya district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X