ఆసుపత్రిలో ఏరివేత: వేలల్లో ఎలుకలు, లక్షల్లో ఖర్చు

ఇదంతా జరిగింది ఇండోర్‌లోని మహారాజా యశ్వంత్ రావ్ ఆసుపత్రిలో. ఆ ఆసుపత్రిలో రోజూ అవట్ పేషంట్స్ విభాగానికి సుమారు వెయ్యిమంది వరకు వచ్చి వెళుతుంటారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 400మంది పేషంట్స్ ఉన్నారు. ఐతే ఈ ఆసుపత్రిలో సుమారు పదివేలకు పైగా ఎలుకలు ఉన్నాయంట.
ఆసుపత్రిలో రోగుల కంటే ఎక్కువగా ఉన్న ఎలుకలను పట్టేందుకునేందుకు సుమారు రూ. 55 లక్షలు వెచ్చించారు ఆసుపత్రి వర్గాలు. ఆపరేషన్ కాయ కల్ప్ పేరుతో రెండు రోజులుగా కొనసాగిన ఈ ఎలుకల వేటలో పట్టిన ఎలుకలు కేవలం 2,500 మాత్రమేనట!
దీంతో గత కొన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన పాపానికి ఇంత భారీ మొత్తాన్ని వృధాగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇరవై ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ఆపరేషన్ చేయడానికి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టామని, కాని ఇప్పుడు 78 లక్షలు అయిందని డాక్టర్ సంజయ్ జి కర్మార్కర్ చెప్పారు. ఎలుకలకు ఒక నెలకు ఎర వేసేందుకు సుమారు రూ. 1.8 లక్షలు ఖర్చు పెట్టామన్నారు.
ఎలుకలను పట్టుకునేందుకు గత నెల రోజులుగా 40 మంది పని చేశారని తెలిపారు. డిసెంబర్ 4వ తారీఖుకల్లా ఆసుపత్రిలో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications