17 వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. 'తల్లికి వందనం' అమలు చేయాలంటూ నెట్టింట కామెంట్స్..!
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. తదితర కారణాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు అధికం అయ్యాయి. దీంతో దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఏకంగా 17వ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ మహిళకు 55 ఏళ్లు కాగా తాజాగా ఆమె 17 వ సారి విజయవంతంగా ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం దంపతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో సంతానోత్పత్తి ఒకటి. లేటు మ్యారేజీలు, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా సరైన సమయంలో పిల్లలు పుట్టక దంపతులు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అయితే రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కు చెందిన ఓ 55 ఏళ్ల మహిళ.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కు చెందిన రేఖ గల్ బేలియా(55) తాజాగా 17 వ బిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు ఇదివరకే 16 మంది సంతానం కాగా రేఖ తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఆమెకు 17వ సంతానం. ఇదివరకే జన్మించిన 16 మంది సంతానంలో ఇప్పటికే ఐదుగురికి వివాహాలు జరిగాయి. అయితే తాజాగా రేఖ పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. నాలుగో ప్రసవం అని వైద్యులకు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత విషయం తెలిసి వైద్యులు షాక్ అయ్యారు. తమకు ఇళ్లు లేదని ప్రభుత్వం ఆదుకోవాలని.. పిల్లల్ని చదివించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని రేఖ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

అయితే ఈ ఘటనపై నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారులకు తల్లికి వందనం లాంటి పథకాలను అక్కడ కూడా అమలు చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. మరోవ్యక్తి ఈ రోజుల్లో 17 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనం అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది మాత్రం 17 కాన్పులు అంటే నమ్మశక్యంగా లేదని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications