భూ ప్రకంపనలతో వణికిన ఢిల్లీ, యూపీ, బీహార్: అర్ధరాత్రి జనం పరుగు, నేపాల్‌లో 6.4 తీవ్రత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంత ప్రజలు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో వణికిపోయారు. నేపాల్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శుక్రవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా బలమైన భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
శుక్రవారం రాత్రి 11:32 ప్రాంతంలో సంభవించిన భూకంపం కేంద్రం.. 10 కిలోమీటర్ల లోతులో నేపాల్‌లో 28.84 ° అక్షాంశం, 82.19 ° రేఖాంశంతో ఉందని NCS పేర్కొంది. ఇటీవలి కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించడం ఈ ఘటన మూడోసారి కావడం గమనార్హం. దీంతో ఢిల్లీ ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూకంపం వస్తుందేమోనని చాలా మంది ఇంటిముందు రోడ్లపైనే ఉన్నారు.

కాగా, ఎన్‌సిఆర్‌తో పాటు, బీహార్ రాజధాని నగరం పాట్నా నుంచి కూడా భూకంపం చోటు చేసుకున్న దృశ్యాలు వెలువడ్డాయి. 'నేను టీవీ చూస్తున్నాను. అకస్మాత్తుగా కొద్దిగా తల తిరుగుతున్నట్లు అనిపించింది... అప్పుడు నేను టీవీలో భూకంపం గురించి చూశాను. అకస్మాత్తుగా నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చాను' అని నోయిడా నివాసి వార్తా సంస్థ ANIకి తెలిపారు.
Earthquake of Magnitude:6.4, Occurred on 03-11-2023, 23:32:54 IST, Lat: 28.84 & Long: 82.19, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/SSou5Hs0eO@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju @PMOIndia pic.twitter.com/XBXjcT29WX
— National Center for Seismology (@NCS_Earthquake) November 3, 2023
'నేను మంచం మీద పడుకున్నాను. అది వణుకుతోంది, సీలింగ్ ఫ్యాన్ కూడా కదులుతున్నట్లు నేను గమనించాను. వెంటనే నేను నా ఇంటి నుంచి బయటకు వచ్చాను' అని పాట్నా నివాసి మీడియాకు తెలిపారు. భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు రోడ్లపైకి, ఖాళీ స్థలాలను ఆశ్రయించారు. మనదేశంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నేపాల్‌లో ఎక్కువ తీవ్రత నమోదైంది. అయితే, అక్కడ కూడా ఇప్పటి వరకైతే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
VIDEO | Strong tremors felt in Delhi-NCR after earthquake hits Nepal.
— Press Trust of India (@PTI_News) November 3, 2023
(Source: Third-Party) pic.twitter.com/9h7M5liVFv
కాగా, అక్టోబర్ 15న, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది, దాని భూకంప కేంద్రం హర్యానాలోని ఫరీదాబాద్‌కు తూర్పున 9 కిలోమీటర్ల దూరంలో 28.41 ° అక్షాంశం, 77.41 ° రేఖాంశాల వద్ద ఉంది' అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
#WATCH | Bihar: People come out of their homes as tremors felt in Patna pic.twitter.com/PoINrMXIA1
— ANI (@ANI) November 3, 2023
అక్టోబర్ 3న, నేపాల్‌లో సంభవించిన రెండు భూకంపాల ఫలితంగా ఎన్‌సిఆర్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. మొదటి భూకంపం, 4.6 తీవ్రతతో నేపాల్‌లో మధ్యాహ్నం 2:25 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో నేపాల్‌ను తాకింది. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో మరింత శక్తివంతమైన ప్రకంపనలు 25 నిమిషాల తర్వాత 2:51 సమయంలో సంభవించాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications