గ్యాస్ లీక్‌: 6గురు మృతి, వందమందికి అస్వస్థత

లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది.

గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్‌తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ట్యాంకర్ స్ట్రక్ అయింది. ఈ ప్రదేశంలో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైంది.

6 Dead, 100 Injured in Ammonia Gas Tanker Leak in Ludhiana

లుథియానాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకవడంతో ఆరుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతులను లూథియానా ఆస్పత్రికి తరలించారు.

అస్వస్థతకు గురైన బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు తక్షణ సహాయక చర్యలను చేపట్టారు. గ్యాస్ లీకైన ప్రదేశం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+