జగన్నాథుడి రథయాత్రలో హైఓల్టేజ్ షాక్- ఆరుమంది దుర్మరణం
అగర్తల: త్రిపురలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పూరీ జగన్నాథుడి రథయాత్రకు కొనసాగింపుగా చేపట్టిన ఉల్టా రథయాత్రలో విద్యుద్ఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
Big sad event. Today, more than twenty people were electrocuted during Ulta Rath Yatra in Tripura. I express my condolences to the families of the deceased. pic.twitter.com/DNG34rYoNK
— Sushanta Sinha (@sushantasinha) June 28, 2023
త్రిపురలోని ఉనకోటి జిల్లా కుమార్‌ఘాట్‌లో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన సంభవించింది. ఈ నెల 20వ తేదీన రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను కుమార్‌ఘాట్‌కు తీసుకెళ్లారు. అక్కడ పూజలందుకున్న తరువాత ఇవ్వాళ మళ్లీ ఆలయానికి బయలుదేరడాన్ని ఉల్టా రథయాత్రగా పిలుస్తారు.

ఈ మధ్యాహ్నం కుమార్‌ఘాట్‌లో ఈ ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో మార్గమధ్యలో రథం పైభాగం ప్రమాదవశాత్తు 133 కేవీ ఓల్టేజీ విద్యుత్‌ను సరఫరా చేసే హై-టెన్షన్ వైర్‌ను తాకింది. దీనితో భక్తులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఆ వెంటనే మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఆరుమంది వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మరో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నష్టపరిహారాన్ని ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే రాజధాని అగర్తల నుంచి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. రెండురోజుల్లోగా నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications