రక్షణ లేదు: ఢిల్లీలో సగటున రోజుకు 6గురిపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని మహిళలకు ఎంత అభద్రతా నగరంగా మారుతుందో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనతోపాటు అనేక అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అవుతున్నాయి. 2014 సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో ఆరు అత్యాచార కేసులతోపాటు 14 లైంగిక వేధింపుల కేసులు నమోదుయ్యాయి. ఇందులో 90 కేసులను పరిష్కరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య 616 అత్యాచార కేసులు, 1,336 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇది నిరుడితో పోల్చుకుంటే 36శాతం అధికంగా (450 కేసులు) నమోదయ్యాయి. అదే విధంగా లైంగిక వేధింపుల కేసులు కూడా పెరిగిపోయాయి. ఇవి 1,000 కేసులకు పైగా నమోదయ్యాయి. మొదటి నాలుగు నెలల్లో నమోదైన రేప్, లైంగిక వేధింపుల కేసుల్లో 89 శాతం పరిష్కారమయ్యాయని, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

2013లో మొత్తం 1,559 అత్యాచారం, 3,347 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2012లో 680, 653గా ఉంది. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం ఉపేంక్షించబోమని అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైం బ్రాంచ్) అశోక్ చంద్ పేర్కొన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం.. 2011లో దేశంలోనే అత్యధికంగా 568 అత్యాచారం కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. 218 కేసులతో ముంబై ఆ తర్వాత స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ‘రేప్ క్యాపిటల్' అనే అపవాదు కూడా అంటుకుంటోంది. నిర్భయ ఘటన తర్వాత ప్రజల్లో వ్యక్తమైన ఆందోళనలు, ఆగ్రహంతో ప్రభుత్వం మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేసేందుకు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఢిల్లీ పోలీసులు కూడా మహిళల రక్షణకు పలు చర్యలు తీసుకున్నారు. మహిళల సహాయార్థం 24గంటల పాటు అందుబాటులో ఉండే మొబైల్ మహిళా పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ టీంకు రోజుకు సగటున 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఏప్రిల్ 30 వరకు 11,439 కాల్స్ వచ్చాయని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications