కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. రూ. 3 లక్షల కోట్ల ఆదాయం
ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ లో జరుతున్న మహా కుంభమేళాలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు త్రివేణీసంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మరోవైపు దేశ, విదేశాల నుంచి వస్తున్న యాత్రికులతో మహా కుంభమేళాలో వ్యాపారం భారీగా పెరుగుతోంది. యాత్రికులు చేసే ఖర్చులు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లు సమకూరుతాయని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీలో తెలిపారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల కోసం 3000 వంటశాలలు, 1,50,000 మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 40 కిలోమీటర్ల మేర 25 సెక్షన్లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు.

మరోవైపు 2030 నాటికి భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటకం 10 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పర్యటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా 60 శాతం ఉంటుందని తెలిపాయి. ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.












Click it and Unblock the Notifications