పక్కా ప్లాన్: ఏకంగా 60కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు!

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 కేజీల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పలాయంకొట్టాయ్‌లోని అలగర్‌ అనే నగల దుకాణంలో గురువారం రాత్రి దుండగులు ప్రవేశించి 60 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వీటి విలువ కోట్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

60kg of gold stolen from Palayamkottai jewellery store

దొంగలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం నుంచి నగల దుకాణం టెర్రస్‌పైకి వచ్చారని, గ్యాస్‌కట్టర్‌ల సహాయంతో గ్రిల్‌ను తెరిచి ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చోరీ జరిగిన సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది దుకాణం ముందు విధుల్లో ఉండటం గమనార్హం.

శుక్రవారం ఉదయం సిబ్బంది నగల దుకాణం తెరిచి చూసినపుడు ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు క్లూస్‌టీంతోరంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నగల దుకాణం సిబ్బందితోపాటు పలువురిని ప్రశ్నిస్తున్నారు. దొంగలను గుర్తించేందుకు అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ భారీ చోరీ స్థానికంగా సంచలనంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Burglars broke into a jewellery store at Palayamkottai in Tirunelveli district of Tamil Nadu and decamped with 60kg of gold jewellery worth crores of rupees on Thursday night.
Please Wait while comments are loading...