జైల్లో మొత్తం సంపాదన ఏంతంటే..!: భారంగా శశికళ, బుజ్జగించి తినిపించారు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే ఆమె ఆరు నెలల పాటు గతంలో కారాగారంలో ఉన్నారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే ఆమె ఆరు నెలల పాటు గతంలో కారాగారంలో ఉన్నారు. ఇప్పుడు మరో మూడున్నర ఏళ్లు ఊచలు లెక్కించాల్సి ఉంది.
జైలులో సత్ప్రవర్తన కారణంగా కాస్త ముందు విడుదలయితే తప్ప.. ఆమె 3.6 ఏళ్లు జైలులో ఉండనున్నారు. జైల్లో ఆమెకు కొవ్వొత్తులు తయారు చేసే పనిని అప్పగించారు. రోజుకు ఆమెకు రూ.50 ఇవ్వనున్నారు.

మూడున్నరేళ్ల పాటు ఆమె జైలులో ఉంటే... ఆమె విడుదలయ్యే సమయానికి రూ.65,700 పొందుతారు. జైలులోని ప్రతి ఖైదీకి ఓ పనిని అప్పగిస్తారు. ఇందులో భాగంగా శశికళకు క్యాండిల్స్ తయారీ అప్పగించిన విషయం తెలిసిందే.
జైలులోకి వెళ్లే ముందు శశికళకు మూడు చీరలు ఇచ్చారు. ఆమె మరో ఇద్దరు మహిళలతో కలిసి జైలులో ఉంటున్నారు. శశికళకు సుప్రీం కోర్టు సోమవారం శిక్ష విధించగా, ఆమె బుధవారం నాడు లొంగిపోయారు. అనంతరం జైలుకు తరలించారు.
కాగా, శశికళ బుధ, గురువారాల్లో రాత్రిపూట జైలులో చాలా భారంగా గడిపారు. సాయంత్రమే కారాగారంలోకి అడుగు పెట్టిన అమె రాత్రి భోజనం చేయలేదు. 80 చ.అ. ఇరుకు గదిలో నిద్ర పట్టక ఇబ్బంది పడ్డారు.
జైలు సిబ్బంది ఇచ్చిన తెల్ల చీర వెంటనే కట్టుకునేందుకు నిరాకరించారు. గురువారం నుంచి ధరించడం అనివార్యమైంది. తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచి కారాగారం ఆవరణలో కాసేపు నడిచారు. ఆ తర్వాత యోగా చేశారు. ఆ తర్వాత పత్రికలు చదువుతున్నారు.
ఉదయం, మధ్యాహ్నం శశికళ ఆహారం తీసుకునేందుకు తొలుత విముఖత చూపారని, కానీ అనారోగ్యం రీత్యా ఆహారం తినాలని ఆమె వదిన ఇళవరసి బుజ్జగించడంతో చివరకు తిన్నారని కారాగార సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications