వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతి

|
Google Oneindia TeluguNews

అస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించారు. వారాంతపు వేతనం వచ్చాక వీరంత మద్యం సేవించారు. ఇక మద్యం సేవించిన చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల క్రితం బూట్‌లెగ్ ఆల్కహాల్ సేవించి ఉత్తర భారతదేశంలో 100 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇక మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. గౌహతి నుంచి 310 కిలోమీటర్ల దూరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం సల్మారా టీ గార్డెన్స్‌లో పని చేస్తున్న కార్మికులు గురువారం సాయంత్రం పని ముగించుకుని మద్యం సేవించారని అందులో నలుగురు మహిళలు వెంటనే మృతి చెందినట్లు చెప్పారు. మరో 12 గంటలు దాటాక 8 మంది మృతి చెందినట్లు చెప్పారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 66కు చేరిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. జూగిబారి ప్రాంతంలో దేశీయ మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీ యజమానిని అరెస్టు చేశారు. దీన్ని అక్రమంగా నడుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇందుకల్పా బర్దోలియో, దేబబోరాలుగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ మద్యం తయారు చేసిన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

66 Tea garden workers dead after consuming spurious liquor in Assam, govt orders Probe

ఒక గ్లాసు మద్యం రూ. 10 నుంచి రూ.20 వరకు అమ్ముతుంటారని స్థానికులు తెలిపారు. ఇక మద్యం అమ్ముతున్న సంజు ఓరంగ్ తన తల్లి ద్రౌపది ఓరంగ్ ఈ మద్యం సేవించిన వెంటనే మృతి చెందినట్లు స్థానికలు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించింది అస్సాం ప్రభుత్వం. నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.

మద్యపానం నిషేధించాలని డిమాండ్ చేస్తున్న స్థానికుడు ప్రవీణ్ దాస్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. నకిలీ మద్యం తయారు చేస్తోందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గత కొద్ది కాలంగా ఆయన ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్ శాఖకు కల్తీమద్యం తయారు చేసుకునే వారి మధ్య మంచి సంబంధాలు ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అస్సాంఘన పరిషత్ పార్టీ డిమాండ్ చేసింది.

English summary
Sixty six tea garden workers died after they consumed spurious liquor in Assam with 39 in Golaghat district alone, after receiving their weekly wages. Several others have been admitted in a critical condition at the Jorhat Medical College Hospital and at the Golaghat civil hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X