ఆమెకు 67.. అతనికి 28 ఏళ్లు, పెళ్లి లేదు, సహజీవనం.. అయినా కోర్టుకు
ఎప్పుడూ ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు.. అదే ప్రేమ.. అయితే వారిద్దరూ సమ వయస్కులు అయితే నో ప్రాబ్లమ్.. కనీసం ఓ పదేళ్ల వరకు తేడా ఉంటే ఏమో అనుకోవచ్చు.. కానీ 67 ఏళ్ల బామ్మతో 28 ఏళ్ల యువకుడికి ప్రేమ పుట్టింది. అంతేకాదు వారిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. మరీ గొడవ ఏంటీ అంటారా.. వారే కోర్టు మెట్కెక్కారు. ఏదో గొడవపడి కాదండొయ్.. వారి ముందుజాగ్రత్త చర్యలో భాగమే ఇదీ.. మధ్యప్రదేశ్‌లో చిగురించిన ఈ వింత ప్రేమ గురించి మీరు కూడా ఓ సారి చదివి చూడండి.

ఇద్దరి మధ్య ప్రేమ..
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వారిద్దరూ తంటాలు పడుతున్నారు. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను నిలబెట్టుకోవాలని ఆ జంట తపన పడుతుంది. ఆ ప్రేమ జంట గురించి అడ్వకేట్ దిలీప్ అవస్తి వివరాలను తెలియజేశారు. కైలారస్ లొకాలిటీకి చెందిన భోలూ అనే యువకుడు, రాంకలీ అనే మహిళ ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవాలనుకోవడం లేదు.

పెళ్లి వద్దట
పెళ్లి చేసుకోకుండా రిలేషన్ షిప్‌లో ఉంటే సమస్యలు వస్తాయని ఆలోచన చేశారు. తమకు న్యాయం జరగాలని గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ లివ్- ఇన్ రిలేషన్‌షిప్‌ను నోటరీ చేయాలని కోరుతున్నారు. అలా అయితే తమకు ఏ ప్రాబ్లబ్ ఉండదని వారు అనుకుంటున్నారు. నోటరీ చేస్తే ఎవరి నుంచి అభ్యంతరాలు రావని ఆ జంట ఆలోచన. యోచన మంచిదే.. కానీ వారి ప్రేమే కాస్త మింగుడు పడని విషయంగా మారింది.

గొడవ వద్దని
రిలేషన్‌షిప్ గురించి భవిష్యత్‌లో ఎలాంటి గొడవలు రాకూడదని వారు అనుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా నోటరీ చేసుకునేందుకు ఆ జంట వచ్చారు. వీరిది నిజంగా చావు తెలివితేటలు.. తమను సమాజం ఏమి అనుకుంటుందో ఆలోచించలే. పైగా వయస్సు తేడా ఉన్నా.. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ సహజీవనం చేస్తున్నారు. అయితే వీరికి ఎవరి నుంచి ఇబ్బందులు రాకుడదట.. అందుకే కోర్టును ఆశ్రయించారు. వీరి ముచ్చట గమ్మత్యే ఉంది.












Click it and Unblock the Notifications