నెంబర్ 6: జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడికి కరోనా వైరస్..

కరోనా వైరస్ రక్కసి భారత్‌లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి వైరస్ సోకిందనే వార్త భయాందోళనకు గురిచేస్తోంది. ఇటలీకి చెందిన పర్యాటకుడు జైపూర్‌లో పర్యటిస్తున్న సమయంలో అస్వస్ధతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.

వాస్తవానికి పర్యాటకుడికి శనివారం పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవడం లేదు. దీంతో సోమవారం మరోసారి పరీక్ష నిర్వహించారు. అతని రక్తనమూనాలను పుణెలో గల నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి పంపించారు. పరీక్ష చేసిన నిపుణులు.. అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. సోమవారం రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

6th coronavirus case confirmed in India: Italian man tests positive..

దుబాయ్ నుంచి వచ్చిన సాప్ట్ వేర్ ఇంజినీర్.. ఢిల్లీలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ గురించి మానిటరింగ్ చేసే బాధ్యతను గ్రూప్ ఆఫ్ మినిస్టర్ట్స్‌కు అప్పగించింది. మరోవైపు ఇటలీ, ఇరాన్, సౌత్ కొరియా, జపాన్.. అత్యవసరం ఉంటే తప్ప వెళ్లొద్దని ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+