వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులు, కేంద్రం మధ్య 6వ దఫా చర్చలు రద్దు -చట్టాల్ని వెనక్కి తీసుకోబోమన్న షా -ఇక మాటల్లేవన్న రైతులు

|
Google Oneindia TeluguNews

కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరపాల్సిన ఆరో దశ చర్చలు రద్దయ్యాయి. ఇప్పటికే ఐదు దఫాల చర్చలు విఫలంకాగా, బుధవారం ఆరో సారి భేటీ అయ్యేందుకుగానూ అజెండా నిర్ణయించడం కోసం రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అందులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆరో దశ చర్చలు రద్దయ్యాయి.

Recommended Video

Amit Shah's Talks With Farmer Leaders Fail వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటారా? లేదా?

సమావేశానికి ముందే తమది సింగిల్ పాయింట్ అజెండా అని స్పష్టం చేసిన రైతులు.. అమిత్ షాతో భేటీలోనూ.. 'వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటారా? లేదా? 'ఎస్ ఆర్ నో' అని ప్రశ్నించారు. అందుకు నో చెబుతూనే, పరిష్కార మార్గాలు అణ్వేషిద్దామంటూ అమిత్ షా రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరికి..

అమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామాఅమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామా

6th-round-talks-cancelled-as-center-not-ready-to-roll-back-farm-laws-says-farmer-leaders

ఢిల్లీలోని ఏసీఏఆర్ ఆఫీసులో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా, నరేంద్ర తోమర్ జరిపిన చర్యలు చివరికి విఫలం అయ్యాయి. ఆరో దఫా చర్చల అజెండా ఖరారులో ఎవరికి వాళ్లే అన్నట్లుగా వ్యవహరించడంతో చివరికి బుధవారం నాటి చర్చలే రద్దయిపోయాయి. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని అమిత్ షా తేల్చిచప్పడంతో రైతులు కూడా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

''రైతుల డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేస్తుందని ఆశించాం. కానీ రైతులతో మాట్లాడేందుకు కేంద్రానికి ఇష్టమే లేదన్న విషయం అమిత్ షాతో భేటీ తర్వాత అర్థమైపోయింది. చట్టాలను వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా లేమని వాళ్లు స్పష్టంగా చెప్పారు. వెనక్కి తీసుకునేదాకా మేం నిరసనల్ని కొనసాగిస్తాం'' అని ఆలిండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ హన్నన్ మొల్లా వ్యాఖ్యానించారు.

English summary
The sixth round of talks between farmer leaders and the government scheduled for tomorrow has been canceled, All India Kisan Sabha general secretary Hannan Mollah told reporters after union leaders met home minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X