పాక్‌లో భారీ భూకంపం: ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా మన దేశంలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. బెలూచిస్తాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలు పైన దాని తీవ్రత 7.8గా నమోదయింది.
పాక్‌లోని సింద్ రాష్ట్రంలోని కరాచీ, హైదరాబాద్, లర్కానా, మరికొన్ని పట్టణాలలో ఈ భూమి కంపించింది. కరాచీ పట్టణంలో ప్రజలు అరుచుకుంటూ భవనాల నుండి బయటకు వచ్చారు. ఇది చాలా శక్తివంతమైన భూకంపంగా యుఎస్ జియలాజికల్ సర్వే వారు తెలిపారు.

దాల్‌బండిన్‌కు సౌత్ ఈస్ట్ ప్రాంతంలో 145 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చిన ప్రాంతం ఉంది.
బెలూచిస్తాన్‌లోని భూకంపం కారణంగా మన దేశ రాజధాని న్యూఢిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. పదిహేను సెకన్ల పాటు ఇది కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications