పెళ్లి కోసం 7గురు జంప్!: ప్రియురాలిపై ప్రియుడు రేప్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్ నుండి ఏడుగురు విద్యార్థులు అక్టోబర్ 14న అదృశ్యమయ్యారు. వాళ్లలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి పెళ్లి చేసుకొని, మంచి ఉద్యోగాలు చేసుకుందామని వారు వెళ్లిపోయారు.
వారు అదృశ్యమైన విషయాన్ని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, తీసుకు వెళ్లిన డబ్బులు అయిపోవటం, ఆకలి వేయడంతో ఇద్దరు తిరిగి పాఠశాలకు వచ్చారు.
వారిని విచారించడంతో అసలు విషయం తెలిసింది. తాము పెళ్లి చేసుకొని, ముంబైలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు చెప్పారు.

ప్రియురాలిపై రేప్
ఓ యువతి పైన ఆమె ప్రియుడు, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన మీరట్‌లో చోటు చేసుకుంది. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు.
ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ తేదీన రెస్టారెంటుకు రావాలని ఆమెకు అతను ఫోన్ చేశాడు. అక్కడ అతని సోదరుడు, మరో స్నేహితుడు ఉన్నాడు. ఆమెను మాటల్లోకి దించి ఓ ప్రాంతానికి తీసుకు వచ్చారు.
అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వారు వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీని పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications