వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజలు చేస్తున్న వారిపైకి దూసుకెళ్ళిన కారు, ఏడుగురి మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జషెండ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని చియాబస పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

శనివారం రాత్రి చియాబాసా-ఛాకర్దార్‌ హైవేపై బరోడా బ్రిడ్జి వద్ద ఉన్న ఓ గుడిలో రెండు గిరిజన కుటుంబాలు వివాహ వేడుకల కోసం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

7 dead, 7 injured after a car rams into locals

నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ బస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ అగర్వాల్‌ కొడుకు అని దర్యాప్తులో తేలింది.

దీంతో ప్రతిపక్షాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శశి భూషణ్‌ క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు.

English summary
At least six people were killed and seven others were critically injured after a speeding car ran over them at Chiabasa-Chakardhar NH 75.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X