వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం: ఏపీలో కలిసే 7 మండలాలివే, ఇంత భూమి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

7 Khammam district Mandals to merge in AP
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు లోకసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. పోలవరం ఆర్డినెన్స్‌లో లోకసభ శుక్రవారం ఆమోదించింది. దీంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి. నిరసనల మధ్య బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.

పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలుస్తాయి. కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు, చింతూరు మండలాలు పూర్తిగా ఏపీలో కలవగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా కలుస్తాయి.

పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఏడు మండలాలలోని 211 గ్రామాలు ఏపీలో కలుస్తాయి. ఈ ప్రాంతంలో 34వేల కుటుంబాలు ఉన్నాయి. లక్షా 16వేల 796 మంది ప్రజలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. 3,267 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 187.29 ఎకరాల అభయారణ్యం ముంపునకు గురి కానుంది. ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టు కోసం మునుగుతుంది. ఇక్కడి గిరిజనులను ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.

పోలవరం ఆర్డినెన్స్‌కు లోకసభలో ఆమోదం లభించడం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

గుత్తా నిప్పులు

మరోవైపు పోలవరం ఆర్డినెన్స్ పైన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. మందబలం ఉపయోగించి ఆర్డినెన్స్‌ను ఆమోదించిందని కేంద్రం పైన విమర్శలు గుప్పించారు. మండలాల బదలాయింపును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ దీనికి వ్యతిరేకమన్నారు.

English summary
Seven Khammam district Mandals to merge in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X