కోట్లలో వ్యాపారం, ఒకే ఇల్లు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు, యజమానులు, అర్దరాత్రి ?
సూరత్: ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. విష పదార్థాలు సేవించి ఆరుగురు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఏడో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. మృతులను మనీష్ సోలంకి, అతని భార్య రీటా, మనీష్ తండ్రి కాను, మనీష్ తల్లి శోభా, మనీష్, రీటా దంపతుల ముగ్గురు చిన్న పిల్లలు దిశా, కావ్యా, కుషాలు చనిపోయారని పోలీసులు గుర్తించారు.
మనీష్ సోలంకి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మనీష్ సోలంకి స్వయంగా రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ లేఖలో ఆర్థిక సమస్యల గురించి మరీష్ రాశాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆర్థిక సమస్యలకు ఖచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని శనివారం సూరత్ డీసీపీ రాకేష్ బరోట్ మీడియాకు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో ఓ లేఖ లభ్యమైంది. దీనికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని. ఆర్థిక సమస్యల కారణంగా ఒకే ఫ్యామిలీలో 7 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని డీసీపీ రాకేష్ తెలిపారు.
తదుపరి విచారణ జరుగుతోందని, ఇప్పుడు పూర్తి సమాచారం చెప్పడం సాధ్యం కాదని డీసీపీ రాకేష్ తెలిపారు. మనీష్ సోలం ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నాడని, అతని దగ్గర సుమారు 35 మంది వడ్రంగులు, కూలీలు పనిచేస్తున్నారని డీసీపీ రాకేష్ తెలిపారు. మనీష్ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు శనివారం ఉదయం ఫోన్ కాల్స్ తో అతనిని సంప్రదించడానికి ప్రయత్నించారు.

మనీష్ సోలంకి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తరువాత మనీష్ ఇంటి తలుపు తట్టినా స్పందించలేదని అతని దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారు లోపలికి ప్రవేశించేందుకు మనీష్ ఇంటి వెనుక కిటికీని పగులగొట్టారని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉందని సూరత్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications