Audi Q3:ఖాళీ రోడ్డు..రాకెట్ స్పీడ్: స్ట్రీట్ లైట్స్‌కు ఢీ: ఎమ్మెల్యే కొడుకు-కోడలు సహా 7 మంది మృతి

బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు యువతులు, నలుగురు యువకులు ఉన్నారు. ఈ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఎమ్మెల్యే కుమారుడు-కోడలు..

ఎమ్మెల్యే కుమారుడు-కోడలు..

మృతుల్లో తమిళనాడుకు చెందిన డీఎంకే శాసన సభ్యుడి కుమారుడు, కోడలు ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కుటుంబీకులు ధృవీకరించారు. వారు ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్, స్ట్రీట్‌లైట్‌, అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనాన్ని ఢీ కొట్టింది. నుజ్జునుజ్జయింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గ్యాస్ కట్టర్లను వినియోగించాల్సి వచ్చింది.

హోసూర్‌ డీఎంకే ఎమ్మెల్యే..

హోసూర్‌ డీఎంకే ఎమ్మెల్యే..

మృతులను కరుణ సాగర్, బిందు, ఇషిత, ధనుష్, అక్షయ్, గోయల్, రోహిత్‌గా గుర్తించారు. మృతులందరూ 20 నుంచి 30 సంవత్సరాలలోపు వారే. వారిలో కరుణ సాగర్, బిందు భార్యాభర్తలు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే శాసన సభ్యుడు వై ప్రకాష్ కుమారుడు-కోడలు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో బెంగళూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వై ప్రకాష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. మిగిలిన వారు బెంగళూరులో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నారు.

 ఖాళీ రోడ్డుపై రాకెట్ వేగం

ఖాళీ రోడ్డుపై రాకెట్ వేగం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వారంతా నంబర్ కేఏ 03 ఎంవై 6666 ఆడి క్యూ3 కారులో బెంగళూరు నుంచి హోసూర్‌కు బయలుదేరారు. ముందు సీట్లల్లో ముగ్గురు, వెనుక నలుగురు కూర్చున్నారు. వారెవరూ కూడా సీట్ బెల్ట్ ధరించలేదు. కోరమంగళ మీదుగా వెళ్తోన్న సమయంలో కారు అదుపు తప్పింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయం కావడం వల్ల రోడ్డంతా ఖాళీగా ఉండటం వల్ల కారును మితిమీరిన వేగంతో నడిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 కోరమంగళలలో

కోరమంగళలలో

కోరమంగళ 80 ఫీట్ రోడ్డు మీదుగా వెళ్తోన్న సమయంలో అదుపు తప్పిన కారు తొలుత ఫుట్‌పాత్ పైకి ఎక్కింది. అనంతరం స్ట్రీట్ లైట్స్‌ బలంగా ఢీ కొట్టింది. అక్కడితో ఆగిపోలేదు. అదే వేగంతో దూసుకెళ్లింది. రోడ్డుపక్కన పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవన సముదాయాన్ని ఢీ కొట్టింది..పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తోన్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఏడు మందికి ఏడుమందీ దుర్మరణం పాలయ్యారు.

Recommended Video

    Karnataka Scorpion Festival : విష పురుగులతో గేమ్స్.. భారీగా జనాలు || Oneindia Telugu
    సీట్ బెల్ట్ పెట్టుకోక

    సీట్ బెల్ట్ పెట్టుకోక

    వారిలో ఎవరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు చెబుతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రమాదం తీవ్రత తగ్గేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. గాయాలతో బయటపడి ఉండేవారని భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ.. ఫలితం లేదని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆడుగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+