వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా ఫక్కిలో రూ. 66 లక్షల ఏటీఎం నగదు లూటీ: అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏటీఎంలో నిల్వ చేయడానికి తీసుకు వెళుతున్న నగదు లూటీ చేసిన 7 మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు స్వాదీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు.

రెండు సెక్యూరిటి ఏజెన్సీ సంస్థలకు చెందిన నిందితులు చాల రోజుల క్రితమే నగదు లూటీ చెయ్యాలని పక్కా ప్లాన్ వేసుకుని నగదు లూటీ చేశారని ఎం.ఎన్. రెడ్డి వివరించారు. మూడు నెలల పాటు కంపెనీలో పని చేసినా సీసీ కెమెరాలలో అతని ముఖం స్పష్టంగా కనపడకుండా జేమ్ షీర్ జాగ్రతలు తీసుకున్నాడు. తల మీద క్యాప్ పెట్టుకుని కవర్ చేశాడని ఎం.ఎన్. రెడ్డి వివరించారు.

కేరళకు చెందిన జేమ్ షీర్ (23), మడికేరి నివాసి కే.ఎం. ప్రభాకర్, చిక్కమంగళూరు నివాసి హేమంత్, జీవర్గి నివాసి నందకుమార్, మాగడి నివాసి రేణుకప్ప, కోళ్లగాల నివాసి మూర్తి, బెంగళూరు నివాసి మంజునాథ్ అనే నిందితులను అరెస్టు చేశారు.

7 persons arrested and cash Rs 30 lakhs seized

అరెస్టు అయిన ప్రభాకర్, హేమంత్ కుమార్, నందకుమార్, రేణుకప్ప అనేపాళ్యలోని ఎస్ఐఎస్ డాట్ కాం అనే సెక్యూరిటి అండ్ ఇంటిలిజెన్స్ కంపెనీలో సెక్యూరిటిగార్డులు, డ్రైవర్ లుగా పని చేస్తున్నారని పోలీసులు అన్నారు. ఇదే సంస్థ పక్కనే ఏటీఎంలో నగదు నిల్వ చేసే బ్రింక్స్ ఇండియా కంపెనీ ఉంది.

నిత్యం ఏటీఎంలో నగదు నిల్వచెయ్యడానికి వాహనాలలో వెళుతున్న విషయం వీరు గుర్తించారు. తరువాత లక్ష్మి ట్రావెల్స్ లో డ్రైవర్ గా పని చేస్తున్న జేమ్ షీర్ బ్రింక్స్ ఇండియా కంపెనీలో డ్రైవర్ గా చేరాడు. ఆరు నెలల నుండి వీరు ఏటీఎంలో నిల్వ చెయ్యడానికి తీసుకు వెళ్లే నగదు లూటీ చెయ్యడానికి ప్లాన్ వేశారు. ప్రభాకర్ ఈ దోపిడికి పక్కా ప్లాన్ వేశాడు.

తరువాత జేమ్ షీర్ తో కలిసి నగదు లూటీ చెయ్యాలని ప్లాన్ వేశారు. మార్చి 31వ తేదిన వాహనంలో రూ. కోటి తీసుకుని ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వ చెయ్యడానికి బయలుదేరారు. ఆ వాహనం డ్రైవర్ జేమ్ షీర్. సిటి మార్కెట్ సమీపంలోని జేపీ స్ట్రీట్ లోని సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం దగ్గరకు వెళ్లారు.

ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి సిబ్బంది వెళ్లారు. అదే సమయంలో జేమ్ షీర్ రూ. 66 లక్షలు ఉన్న వాహనంతో సహ పరారైనాడు. తరువాత చామరాజపేటలో వాహనం వదిలి పెట్టి ఇన్నోవా కారులో నగదు వేసుకుని పరారైనారని ఎం.ఎన్. రెడ్డి తెలిపారు. నిందితులు ఉద్యోగాలలో చేరిన సమయంలో తప్పుడు చిరునామా ఇచ్చారని పోలీసులు తెలిపారు.

English summary
7 persons arrested and cash Rs 30 lakhs seized in a sensational case of theft of ATM cash along with vehicle from Kalasipalya, Bengaluru on March 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X