బీజేపీ తలరాతను నిర్ధారించే పోరు: ఉత్తర ప్రదేశ్‌తోనే మొదలు: తొలిదశ పోలింగ్‌ పూర్తి వివరాలివే

లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ మొదలు కానుంది. ఏడు దశల్లో మార్చి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోట్లాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాజెవరో.. బంటు ఎవరో తేలేది అప్పుడే.

2017లో తిరుగులేని మెజారిటీ..

2017లో తిరుగులేని మెజారిటీ..

ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు.. ఉత్తర ప్రదేశ్‌తోనే ఆరంభం కాబోతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుంది. 408 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి 312 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అదే గెలుపును పునరావృతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు కమలనాథులు. దీనికి అనుగుణంగా వ్యూహాలు రచించారు.

తొలి విడతలో స్టార్ క్యాంపెయినర్లు..

తొలి విడతలో స్టార్ క్యాంపెయినర్లు..

తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రమే ముగిసింది. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కేంద్ర మాజీమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సుడిగాలి ప్రచారాల కార్యక్రమాలను నిర్వహించారు.

బీజేపీకి అత్యవసరం..

బీజేపీకి అత్యవసరం..

ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదని భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ తగ్గితే.. దాని ప్రభావం 2024 నాటి లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనే ఆందోళన బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 80 లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌పై రాజకీయంగా పట్టు కోల్పోతే- 2024 నాటి ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం ఖాయమనే భావన నెలకొంది. మళ్లీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది.

80 లోక్‌సభ స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి 64 చోట్ల ఘన విజయాన్ని సాధించింది. అదే మెజారిటీ మళ్లీ రావాలీ అంటే అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది బీజేపీకి. ఏ మాత్రం తేడా వచ్చినా.. దాని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

యూపీలోనే తొలి విడత

యూపీలోనే తొలి విడత

ఉత్తర ప్రదేశ్‌లోనే తొలిదశ పోలింగ్ జరుగనుంది. మొత్తం 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ఓటర్లు కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఈ 58 నియోజకవర్గాల పరిధిలో 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 58 అసెంబ్లీ స్థానాల కోసం 500 మందికి పైగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

మలి విడత ఎప్పుడంటే..

మలి విడత ఎప్పుడంటే..

రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీన షెడ్యూల్ చేసింది ఈసీ. ఉత్తర ప్రదేశ్‌తో పాటు గోవా, ఉత్తరాఖండ్‌లల్లో పోలింగ్ ఉంటుంది. యూపీలో 55, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ను నిర్వహించేలా ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గోవా, ఉత్తరాఖండ్‌లల్లో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలోనే పోలింగ్ ముగుస్తుంది. 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌తో పాటు పంజాబ్, మణిపూర్‌లల్లో పోలింగ్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+