యజమాని లేని సమయంలో బాలికపై రేప్, హత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైజెన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యజమాని ఇంట్లో లేని సమయంలో అదే ఇంట్లో పని చేసే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైజెన్ జిల్లాలోని భోజ్‌పురి ఆలయానికి సమీపంలో ఓ ఇంట్లో పని చేస్తున్న దౌలత్ సింగ్ భీల్(40) అనే వ్యక్తి తన యజమాని ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను దగ్గర ఉన్న అడవికి తీసుకెళ్లాడు దౌలత్. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి శవాన్ని అక్కడే ఆకులు, రాళ్ల మధ్య పాతిపెట్టి వెళ్లిపోయాడు.

కుమార్తె కన్పించకపోవడంతో వెతుకులాట ప్రారంభించిన తండ్రికి దౌలత్ పాపని తీసుకెళ్లడం చూశామని స్థానికులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దౌలత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
వెంటనే పోలీసులు ఘటనా స్థలం వద్ద బాలిక శవాన్ని బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిపై అత్యాచారం, హత్య నేరాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications