షాక్: నోట్ల రద్దుతో రూ.70 వేల కోట్ల నల్లధనం, ఆర్థిక లావాదేవీలపై విచారణకు ఆదేశం
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత దేశంలో సుమారు 70 వేల కోట్ల రూపాయాల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మెన్ జస్టిస్ అరిజిత్ ఫసాయత్ చెప్పారు.
కటక్: పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో 70 వేల కోట్ల రూపాయల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనం పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మెన్ జస్టిస్ అరిజిత్ పసాయత్ చెప్పారు.
దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
పెద్ద నగదును అరికట్టేందుకుగాను ఆ రోజు నుండి కేంద్రం అనేక చర్యలను తీసుకొంటుంది.నగదు రహిత లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అంతేకాదు సిట్ పలు సిఫారసులను చేసింది.
వ్యక్తులు, సంస్థల వద్ద పెద్ద ఎత్తున నగదు నిల్వలపై పరిమితులు కూడ పరిమితులు విధించాలని కూడ సిట్ సిఫారసులు చేసింది. అయితే సిట్ సిఫారసులను అమలు చేస్తే నల్లధనం నిర్మూలన సులభమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

70 వేల కోట్ల నల్లధనం బయటపడింది.
పెద్ద నగదునోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయాల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మెన్ జస్టిస్ అరిజిల్ ఫసాయత్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో సుప్రీం కోర్టుకు ఆరో మధ్యంతర నివేదికను సమర్పించనున్నట్టు ఆయన చెప్పారు.నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

సిట్ సిఫారసుల అమలు దిశగా కేంద్రం చర్యలు
ఇప్పటికే సిట్ మధ్యంతర నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను సిట్ సమర్పించిన నివేదికలను కేంద్రం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చాలావరకు ఈ సిఫారసులను అమలు చేసింది. కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో కూడ ఉన్నాయి.

లెక్కల్లో చూపని నగదును సీజ్ చేయాలి
లెక్కల్లో చూపకుండా రూ.15 లక్షల నగదు కాని, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రతిపాదన చేసినట్టుగా సిట్ డిప్యూటీ చైర్మెన్ జస్టిస్ ఫసాయత్ చెప్పారు.అయితే సిట్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఇప్పటికే రూ.3 లక్షల రూపాయాల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్ళడంపై ఆంక్షలను విధించింది.

పలు సంస్థల ఆర్థిక లావాదేవీలపై విచారణకు సిట్ ఆదేశం
ప్రైవేట్ విధ్యాసంస్థలు, నగల వ్యాపారులు, రియల్ ఏస్టేట్ వ్యాపారుల, ఆధ్యాత్మిక వేత్తలు, మాఫియా డాన్ ల ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఒడిశా క్రైం బ్రాంచ్ అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు లావాదేవీలపై విచారణ జరపడం ద్వారా లెక్కలు చూపని ఆదాయాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications