వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్లు నిల్: ముంబైలో మూతబడ్డ 71 వ్యాక్సిన్ సెంటర్లు, ప్రజల నిరసన

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ డోసులు చాలా కేంద్రాల్లో ఖాళీ అయ్యాయి. ముంబైలోని సుమారు 70కిపైగా వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిన్ డోసులు స్టాక్ లేదు. బీకేసీలోని ఓ జంబో వ్యాక్సినేషన్ సెంటర్లో కూడా వ్యాక్సిన్ డోసులు అయిపోయాయి.
దీంతో కేంద్రాన్ని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం బారులు తీరిన ప్రజలు నిరసన చేపట్టారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో డోసులు తొందరగానే అయిపోయాని వ్యాక్సినేషన్ సెంటర్ డీన్ రాజేశ్ డెరి తెలిపారు. ఇప్పటికే స్టాక్ వస్తుందని అనుకున్నప్పటికీ రాలేదని చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద కేవలం 160 డోసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

71 Vaccination Centres In Mumbai Shut Due To Shortage, Protests

ముంబైలోని 120 కేంద్రాల్లో ప్రజలకు వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. కాగా, వీటిలో 71 కేంద్రాల్లో కరోనా డోసులు మొత్తం అయిపోయాయి. ఈ మేరకు వివరాలను బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) తెలిపింది. 49 కేంద్రాలు మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ నడుపుతోంది. 40వేల నుంచి 50వేల మందికి వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు.

శుక్రవారం నాటికి 76వేల నుంచి లక్ష డోసులు ముంబైకి చేరుకోవాల్సి ఉండగా.. దీనిపై అధికారిక సమాచారం లేదని ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల తీవ్ర కొరత కారణంగా ముంబై, సతార, సంగ్లి, పాన్వెల్ లాంటి నగరాల్లో పలు వ్యాక్సిన్ సెంటర్లు మూతపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు కరోనా డోసులు తక్కువ పంపిస్తున్నారని ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. నెల రోజుల్లో 1.6 కోట్ల డోసులు రావాల్సి ఉండగా రాలేదని చెప్పారు.

కాగా, మహారాష్ట్ర మంత్రి రాజేశ్ ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలో అత్యధిక కరోనా వ్యాక్సిన్లు పొందిన తొలి మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయని, ఇవి రెండు కూడా బీజేపీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని చెప్పారు.

English summary
71 Vaccination Centres In Mumbai Shut Due To Shortage, Protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X