ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి ట్వీట్

76th Republic Day: దేశ 76వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోంది.

76th Republic day PM Modi and Telangana CM revanth Reddy extends greetings

ఒక్క న్యూఢిల్లీ జిల్లాలోనే 15,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన ఆరు లేయర్‌ల భద్రతను ఏర్పాటు చేశారు. డేటా బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్, వీడియో ఎనలిటిక్స్‌తో కూడిన 2,500కు పైగా సీసీటీవీ కెమెరాల అమర్చారు. కర్తవ్యపథ్ చుట్టూ నాలుగు చదరపు కిలోమీటర్ల మేర గగనతలాన్ని మూసివేశారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యాంగాన్ని నిర్మాతలను స్మరించుకున్నారు. రాజ్యంగ విలువలు.. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని అన్నారు. దేశ గౌరవాన్ని ద్విగుణీకృతం చేశాయని చెప్పారు. మన రాజ్యాంగ విలువలు, ఆదర్శాలను పరిరక్షించడానికి మరింత కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అత్యంత శక్తిమంతమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం నిరంతరం శ్రమిస్తామని మాటిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర దేశం వర్ధిల్లడానికి మూలాధారం రాజ్యాంగమేనని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.

ఈ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, దేశాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+