Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

77th Republic Day:గర్వంతో ఉప్పొంగుతున్న భారతం..కర్తవ్య పథ్‌లో అద్భుత దృశ్యం..!!

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 76 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (77th Republic Day Celebrations) మిన్నంటుతున్నాయి. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పరేడ్‌ను ప్రారంభిస్తారు. ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ గీతం వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో, ఈ ఏడాది పరేడ్ థీమ్‌ను "వందేమాతరం - ఆత్మనిర్భర్ భారత్" గా రూపొందించారు.

77th Republic Day

శక్తి సామర్థ్యాల ప్రదర్శన.. సాంస్కృతిక వైవిధ్యం: ఈసారి కవాతులో భారత సైన్యం తన అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు మరియు తొలిసారిగా 'భైరవ్ లైట్ కమాండో బెటాలియన్' విన్యాసాలను ప్రదర్శించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా 30 శకటాలు, సుమారు 2,500 మంది కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. గగనతలంలో భారత వాయుసేన యుద్ధ విమానాల విన్యాసాలు దేశ పౌరులలో దేశభక్తిని ఉరకలెత్తించనున్నాయి. కర్తవ్య పథ్‌తో పాటు ఏపీ తెలంగాణ నుంచి ఎప్పటికప్పుడు రిపబ్లిక్‌డే వేడుకల తాజా సమాచారం, అద్భుతమైన ఫోటోలు,వీడియో అప్‌డేట్స్ కోసం వన్ ఇండియా లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.

Jan 26, 2026, 10:54 am IST
ఢిల్లీ

Astronaut Shubhanshu Shukla conferred Ashoka Chakra
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వ్యోమగామి శుభాన్షు శుక్లాకు అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అందజేశారు.
Jan 26, 2026, 10:38 am IST
ఢిల్లీ

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గొప్ప ఆయుధమని, ఇది మన స్వరం, మన హక్కులకు రక్షణ కవచమని పేర్కొన్నారు. హక్కులను కాపాడుకోవడమే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని ట్వీట్ చేశారు.
Jan 26, 2026, 10:27 am IST
ఢిల్లీ

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ఇందులో చూపారు.
Jan 26, 2026, 10:23 am IST
ఢిల్లీ

PM Modi paying homage to the fallen soldiers at the National War Memorial
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. దేశ రాజధానిలోని అమరవీరుల స్థూపం వద్ద పుష్ప మాలలు ఉంచి వారి సేవలను స్మరించుకున్నారు.
Jan 26, 2026, 9:21 am IST
ఢిల్లీ

కర్తవ్యపథలో అమర్చిన గ్యాలరీలకు నదుల పేర్లు కేటాయించారు. కావేరి, కోసి, కృష్ణ, పెరియార్, రావి, సోన్, మహానది, నర్మద, పెన్నా, సట్లేజ్, తీస్తా, వైగై, యమునా, బీస్, గండక్, గంగ, ఘాగ్రా, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గోదావరి, సింధు, ఝీలం వంటి నదుల పేర్లు పెట్టారు.
Jan 26, 2026, 9:02 am IST
మహారాష్ట్ర

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్‌ఎస్‌ఎస్ నాగ్‌పూర్ మహానగర్ సంఘచాలక్ రాజేష్ లోయా.
Jan 26, 2026, 8:42 am IST
ఢిల్లీ

కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయన్ హాజరయ్యారు. 'వందే మాతరం' 150 ఏళ్ల ప్రస్థానం థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Jan 26, 2026, 8:35 am IST
సిక్కిం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 16,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పి ఉన్న లోయలో సైనికులు వేడుకలను జరుపుకున్నారు. మువ్వన్నెల పతకాన్ని ఎగురవేశారు.
Jan 26, 2026, 7:54 am IST
ఉత్తర్ ప్రదేశ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారణాశిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాధ ఆలయంలో శివలింగానికి మువ్వన్నెల పూలతో అలంకరించారు. తెల్లవారు జామున హారతి సమయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Jan 26, 2026, 7:30 am IST
రాజస్థాన్

గణతంత్ర దినోత్సవాల వేళ భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. నాగౌర్ జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో దాదాపు 9,550 కిలోల బరువున్న 187 బస్తాల అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, వైర్లు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్ ఖాన్ అనే వ్యక్తి అక్రమంగా వీటిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
Jan 26, 2026, 7:23 am IST
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరుగనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు శాసన మండలిలో, 8.15 నిమిషాలకు అసెంబ్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Jan 26, 2026, 7:19 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్, అలస్కా, సౌత్ డకోటా వంటి అమెరికన్ రాష్ట్రాల గవర్నర్లు.. భారత్ కు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటనలను విడుదల చేశారు.
Jan 26, 2026, 7:07 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. వికసిత్ భారత్ ఆశయాన్ని సాకారం చేసే దిశగా మన సంకల్పానికి, అంకితభావానికి నూతన శక్తిని, సరికొత్త ఉత్సాహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Jan 26, 2026, 6:47 am IST
తమిళనాడు

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం యావత్ దేశం ముస్తాబైన వేళ తమిళనాడులో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మధురైలో వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోల్, కిరోసిన్ బాంబులు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనల్లో స్థానికులు గాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+