Corona: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. రాష్ట్రంలో కూడా..!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 98.80 శాతం రికవరీ రేటు ఉందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వైరస్ తో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొరు చొప్పున మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,30,795కు పెరిగింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరింది.కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఏడు రోజుల సగటు తాజా కేసులు 500 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.గుజరాత్ లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందతుంది.

796 new corona cases has Reported in india in last 24 hours

గుజరాత్ తర్వాత కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర, తమిళనాడులో నమోదు అవుతన్నాయి. ఇటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ వచ్చింది. 54 కేసుల్లో 40 కేసులు హైదరాబాద్ పరిధిలో వచ్చాయి. మంగళవారం 52 కేసులు నమోదు కాగా 30 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. కొవిడ్ పాజిటివ్ రేటు 1.09గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో ప్లూ లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా పెరుగుతన్నారు. మరోవైపు దేశాన్ని ఇన్‌ఫ్లూయెంజా కేసులు వణికిస్తున్నాయి. తుమ్ములు, దగ్గడం, తుంపర్లు పడటం, కలుషితమైన ఉపరితలాలతో (ఫోమైట్స్) ద్వారా ఫ్లూ వ్యాప్తి చెందుతాయి. కొన్ని సందర్భాల్లో, అవి సోకిన వ్యక్తుల మలం ద్వారా కూడా వ్యాప్తి జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+