వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహరాన్ పుర్ ఘర్షణ: 8 మంది జైలు నుంచి విడుదల, ఆధారాలు లేకపోవడంతో..

|
Google Oneindia TeluguNews

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన కామెంట్ల వివాదం దుమారం రేపింది. అయితే ఉత్తరప్రదేశ్ సహరాన్‌పుర్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆస్తుల ధ్వంసం చేయడం, నిరసనలు చేయడంతో దాదాపు 85 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 9 మందిపై పోలీసులు దాడి చేశారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది.

ఆ 9 మంది దాడి చేసినట్టు ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో స్థానిక కోర్టు వారిపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. దీంతో వారు నిన్న జైలు నుంచి బయటకు వచ్చారు. దాడిలో మహ్మద్ అలీ అనే చేయి గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు 9 మందిని పోలీసులు దాడి చేశారు. ఆ వీడియో బయటకు వచ్చింది. కామెంట్లకు సంబంధించి ఇదీ రిటర్న్ గిప్ట్ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే శాలబ్ మని త్రిపాఠి కామెంట్ చేశారు. కానీ ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో విడుదల అయ్యారు.

8 Beaten By UP Cops in Saharanpur Viral Video Leave Jail

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నూపుర్ శ‌ర్మ ప్రకటనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇదీ ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ప్ర‌యాగ్ రాజ్‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లే జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఇటీవ‌ల యూపీలోని కాన్పూర్ లో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌లో కూడా పోలీసులు 1500 మందిపై కేసులు న‌మోదు చేశారు. జ్ఞాన్ వ్యాపి మ‌సీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో నూపుర్ శ‌ర్మ పాల్గొన్నారు. ముస్లింల అరాధ్యుడైన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆమె కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో ఓ టైలర్ తల నరికిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
8 men assaulted in custody by the police in a viral video after protests in Uttar Pradesh's Saharanpur last month have been cleared of charges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X