టూరిస్ట్ రైలులో భారీగా ఎగిసిన మంటలు: 10 మంది మృతి, 20 మందికి గాయాలు, ప్రమాదానికి కారణం ఇదే
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై సమీపంలో మధురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న టూరిస్ట్ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
IRCTC స్పెషల్ ట్రైన్లో ఘోరప్రమాదం.. ప్యాంట్రీ కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 8మంది మృతి#MaduraiRailwayStation #TrainAccident #IRCTCSpecialTrain #Oneindiatelugu pic.twitter.com/mnp4zfnOSk
— oneindiatelugu (@oneindiatelugu) August 26, 2023
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నుంచి రామేశ్వరానికి ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చిన టూరిస్ట్ రైలు.. చెన్నై సమీపంలోని మధురై రైల్వే స్టేషన్‌లో ఆగింది.

ఈ క్రమంలో ఈ ప్రైవేట్ పార్టీ కోచ్‌లోని ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని దక్షిణ రైల్వే తెలిపింది. ఆ మంటలు వెంటనే రైలులోని రెండు కోచ్‌లకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పర్యటకులను రక్షించేందుకు, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నించాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ముధురై కలెక్టర్ సంగీత ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం 5:15 గంటలకు మదురై యార్డ్‌లో మంటలు చెలరేగాయని దక్షిణ రైల్వే అధికారి తెలిపారు. ఇతర కోచ్‌లకు ఎలాంటి నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని వివరిస్తూ.. ప్రయాణీకులు గ్యాస్ సిలిండర్‌ను అక్రమంగా తరలించారని, ఇది మంటలకు దారితీసిందని రైల్వే అధికారి తెలిపారు.
సహాయం కోసం ప్రభుత్వం టోల్ ప్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. 9360552608, 8015681915 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది.












Click it and Unblock the Notifications