వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మెడికల్ రీసెర్చ్‌కు 93 ఏళ్ల వృద్దురాలి మృతదేహం అప్పగింత... ఆ విషయంలో దేశంలోనే మొట్టమొదటి మహిళ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతాకు చెందిన 93 ఏళ్ల జ్యోత్స్నా బోస్ అనే కార్మిక నాయకురాలి మృతదేహాన్ని కరోనా మెడికల్ రీసెర్చ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు 'గందర్పన్' అనే ఓ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. దేశంలో కరోనా పరిశోధనల కోసం ఒక మహిళ మృతదేహాన్ని దానం ఇవ్వడం ఇదే మొట్ట మొదటిసారి. తన మరణానంతరం మృతదేహాన్ని బ్రొజో రాయ్స్‌కి చెందిన గందర్పన్ సంస్థకు అప్పగించాలని పదేళ్ల క్రితమే జ్యోత్స్నా బోస్ ప్రతిజ్ఞ చేశారని ఆమె మనువరాలు డా.టిస్టా బసు తెలిపారు.

ఆమె కోరిక మేరకే...

ఆమె కోరిక మేరకే...

జ్యోత్స్నా బోస్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఆరోగ్యం క్షీణించడంతో మే 14న కోల్‌కతాలోని బెలియఘటా ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆస్పత్రిలోనే కన్నుమూశారు. జ్యోత్స్నా మృతి అనంతరం ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గందర్పన్ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. కరోనా పరిశోధనల నిమిత్తం ఆమె మృతదేహాన్ని దానం చేశారు. దేశంలో ఒక మహిళ మృతదేహాన్ని కరోనా పరిశోధనలకు దానం చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పదేళ్ల క్రితమే నిర్ణయం...

పదేళ్ల క్రితమే నిర్ణయం...

జ్యోత్స్నా బోస్ మనువరాలు డా.బసు మాట్లాడుతూ... 'కరోనా వైరస్ అనేది ఒక కొత్త వైరస్ కావడం వల్ల దాని గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు. మనిషి శరీరంలోని అవయవాలు,అవయవ వ్యవస్థలపై అది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోస్టుమార్టమ్ ప్రక్రియ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.' అని తెలిపారు. గందర్పన్ సంస్థ వ్యవస్థాపకులు బ్రొజో రాయ్,అప్తమాలజిస్ట్ డా.బిశ్వజిత్ చక్రవర్తి కూడా తమ మరణానంతరం మృతదేహాలను కరోనా మెడికల్ రీసెర్చ్ నిమిత్తం దర్పన్ సంస్థకు అప్పగించారు.

జ్యోత్స్నా బోస్ నేపథ్యం

జ్యోత్స్నా బోస్ నేపథ్యం

జ్యోత్స్నా బసు 1927లో ఇప్పటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా నుంచి భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో ఆమె తండ్రి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఆమె కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఆ కారణంగా ఆమె చదువు కూడా సజావుగా సాగలేదు. బ్రిటీష్ టెలిఫోన్స్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ ఆమె తన చదువును కొనసాగించింది. ఆ తర్వాతి కాలంలో కోల్‌కతాలో కార్మిక సంఘ ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రముఖ కార్మిక నాయకుడు మోని గోపాల్ బసును ఆమె పెళ్లి చేసుకున్నారు. తన జీవిత కాలం మొత్తం సామాజిక,రాజకీయ కార్యక్రమాలతో ఆమె బిజీ బిజీగా గడిపారు.

Recommended Video

Long COVID ఓసారి తగ్గాక మళ్లీ ?| 6-12 Months After First Infection మళ్లీ వైరస్ దాడి| Oneindia Telugu

English summary
Jyotsna Bose, a 93-year-old trade union leader from Kolkata, became the "first woman" in the country whose body has been donated for medical research to find out the effects of coronavirus on humans, an organisation that spearheaded cadaver donation in Bengal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X