హోరా హోరీ - గెలిచేదెవరు..!!
దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల సమరంకు సర్వం సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 ఎంపీ స్థానాలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా నాలుగో విడత మొత్తంగా 96 స్థానాల్లో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సర్వం సిద్దం
లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే విడతలో పోలింగ్ నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణ 17, ఉత్తర ప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్ 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

నాలుగో విడత
ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈనెల 13న జరిగే తొలివిడతలో 28స్థానాలకు, ఈనెల 20న జరిగే రెండో విడతలో 35, ఈనెల 25న 42, జూన్ 1న 42శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌తో పాటు షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ నియోజవర్గాల్లో రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేష్‌తో పాటు టీఎంసీ నేతలు మహువా మొయిత్ర వెస్ట్ బెంగాల్ కృష్ణనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
ముఖ్య నేతల పోటీ
అలాగే తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసన్సోల్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు గిరిరాజ్ సింగ్ బీహార్‌లోని బేగుసరాయి నియోజకవర్గంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఝార్ఖండ్ నుంచి ఖుంటి నియోజకవర్గంలో అర్జున్ ముండా పోటీ చేస్తున్నారు. మూడో విడతలో అధికారంలో ఉన్న అమిత్ షా వంటి అగ్రనేతలు బరిలో నిలిస్తే ఇప్పుడు ప్రతిపక్షంలోని ముఖ్యనేతలు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆసక్తిగా మారింది. మహారాష్ట్రలో నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పుణె, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్‌లో కూడా పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నబరంగ్‌పుర్, బెర్హంపుర్, కోరాపుట్, కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications