అయోధ్య రామ మందిరం, వందలాది అడుగుల ప్రత్యేక అగరబత్తి, ఎక్కడ చేశారంటే?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ మందిరంలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న రోజే కర్ణాటకలోని రాచనగరి మైసూర్ నగరంలో 111 అడుగుల పొడవాటి అగరుబత్తీ వెలిగింది. శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా ఈ అగరతి తయారు చేశారు.
మైసూరు నగరంలోని కోటే ఆంజనేయస్వామి ఆలయం ఆవరణంలో సైకిల్ అగరబత్తీ సంస్థ తయారు చేసిన 111 అడుగుల పొడవు గల ధూపదీపాన్ని భక్తి శ్రద్దలతో వెలిగించారు. ఈ కార్యక్రమంలో మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి 111 అడుగుల పొడవు గల అగరబత్తీని వెలిగించారు. ఎమ్మెల్యే టి. ఎస్. శ్రీవత్సతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మైసూర్‌లోని కోటేలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల పొడవు గల అగరుబత్తీని పరంపర పేరుతో వెలిగిస్తారు. 24 రోజుల పాటు ఉంచేందుకు నిర్వాహకులు అనుమతి కోరారు. అయితే పోలీసులు దానిని 2 గంటలు మాత్రమే పెట్టడానికి అనుమతించారు. బొగ్గు, వెదురు, చందనం పొడి, తేనె, సాంబ్రాణి, బెల్లం వంటి పదార్థాలను ఉపయోగించి ఈ భారీ అగర్బత్తిని తయారుచేశారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేరిట 18 మంది నిష్ణాతులైన కళాకారులు 23 రోజుల పాటు శ్రమించి 111 అడుగుల ఈ అగరబత్తిని తయారు చేశారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. చాముండేశ్వరి నియోజకవర్గంలోని పవిత్ర స్థలం హారోహళ్లిలో ఈ విగ్రహం రాయి లభించింది.
సోమవారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం మీద అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పుణ్య కార్యక్రమాలకు హిందూవులు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందని హిందూ సంఘ సంస్థల నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications