పెళ్లి చేసుకోవాలని యువతిని రేప్ చేశాను
బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అవుతుందని భయంతోనే తాను అత్యాచారం చేశానని మినీ బస్సు డ్రైవర్ రవి (21) పోలీసుల ముందు అంగీకరించాడు. విచారణలో అతను పదేపదే ఈ విషయం చెబుతున్నాడని విచారణ చేస్తున్న పోలీసులు అన్నారు.
హోసకోటేలోని ప్రయివేటు నర్సింగ్ హోంలో ఉద్యోగం చేసే 19 సంవత్సరాల యువతిని డ్రాప్ ఇస్తానని నమ్మించి కదులుతున్న మిని బస్సులో అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రవిని, అతనికి సహకరించిన క్లీనర్ మంజునాథ్ ను బెంగళూరు గ్రామీణ జిల్లాలోని సూలిబెలె పోలీసులు అరెస్టు చేశారు.

కేసు విచారణలో రవి తాను గత సంవత్సరం నుంచి ఆ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అత్యాచారం చేశానని విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
తనను వివాహం చేసుకోవాలని మనవి చేస్తే ఆమె తిరస్కరించిందని, అందుకే అత్యాచారం చేశానని రవి పోలీసులకు చెప్పాడు. అయితే తనకు రవి ఎవరో తెలియదని, మూడు రోజుల క్రితమే అతనిని చూశానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications