దారుణం: 20నెలల పసికందుపై అత్యాచారం
బళ్ళారి: కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి నగరంలో గురువారం దారుణ ఘటన జరిగింది. 20నెలల పసికందుపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాధిత చిన్నారి తల్లిదండ్రులు భవన నిర్మాణ కూలీలు. బళ్ళారి నగరం కౌల్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిహట్టి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని గదిలో ఉంటూ అక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు.

గురువారం వారు పనిలో ఉండగా అదే ప్రాంతంలో ఉంటున్న రిజ్వాన్(18) అనే యువకుడు చిన్నారిని ఆడిస్తున్నట్లు నటిస్తూ భవనంపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. కొద్దిసేపటికి చిన్నారి ఏడుపు విన్న తల్లిదండ్రులు ఆందోళనకు గురై భవనం పైకి చేరుకుని చూడగా తీవ్ర రక్తస్త్రావంలో పాప కనిపించింది.
వెంటనే వారు కౌల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రిజ్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లు కౌల్‌బజార్ సిఐ గోళిసంగి తెలిపారు.












Click it and Unblock the Notifications