భార్య, పాప, పెళ్లి చేసుకోవాలని బాస్ లైంగిక వేదింపులు, కార్యాలయంలో యువతి ఉరి వేసుకుని!
బెంగళూరు: పని చేస్తున్న కార్యాలయంలో బాస్ (యజమాని) లేంగిక వేదింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి (22) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.
దోమ్మలూరులోని బీడీఏ లేఔట్ లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు కార్యాలయం నిర్వహిస్తున్నాడు. బీడీఏ లేఔట్ సమీపంలోనే కిరణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. కిరణ్ కుమార్ కు వివాహం అయ్యి భార్య, ఒక పాప ఉంది. అయితే కార్యాలయంలో పని చేస్తున్న యువతి మీద కిరణ్ కుమార్ కన్ను వేశాడు.

కార్యాలయంలో పన చేస్తున్న యువతిని ప్రేమించాలని కిరణ్ కుమార్ ఒత్తిడి చేశాడని సమాచారం. అంతే కాకుండా యువతిని కిరణ్ కుమార్ లైంగిక వేదింపులకు గురి చెయ్యడంతో యువతి జీవితం మీద విరక్తి పెంచుకుంది. పని చేస్తున్న కార్యాలయంలో యువతి సీలింగ్ ఫ్యాన్ కు చుడిదార్ వేల్ తో ఉరి వేసుకుంది.
విషయం గుర్తించిన సాటి సిబ్బంది వెంటనే యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రుల దగ్గర కిరణ్ కుమార్ చెప్పాడని, ఇప్పటికే వివాహం అయ్యి భార్య, పాప ఉన్న అతనితో వివాహం చెయ్యడానికి తన కుటుంబ సభ్యులు నిరాకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిరణ్ కుమార్ కార్యాలయంలో పని చేస్తున్న వారిని విచారణ చేసి వివరాలు సేకరించి అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications