నిద్రపోతున్న భర్తపై 11 కత్తిపోట్లు... గోంతుకోసి హత్య, ఆ... సంబంధమే కారణం...

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో కసితో రగిలిపోయిన భార్య నిద్రపోతున్న భర్తను వంటగదిలో ఉన్న కత్తితో 11 సార్లు కడుపులో పోడించింది.... అనంతరం గోంతుకోసి బయటకి వచ్చేసింది...విచిత్రం ఏమిటంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది. విచారణలో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ఏ భార్యయిన, భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే సాధరణంగా ఆవేశానికి లోనవుతారు. దీంతో వాళ్లను రెండ్ హ్యండెడ్‌గా పట్టుకుని తగిన బుద్ది చెబుతున్న పరిస్థితులు ఇటివల కొకొల్లలుగా చూస్తున్నాము... తన భర్తకు బుద్ది రావడంతో పాటు, వివాహేతర సంబంధం కొనసాగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు.. కాని ఓ మహిళ మాత్రం ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కడతేర్చాలని భావించింది. అక్రమ సంబంధంతో తరచు గొడవలు రావడంతో భరించలేని భార్య అనుకున్నంత పని చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబాయిలోని నల్లాసోపోరా ప్రాంతంలోని సునిల్ కాదమ్, అనే 33 సంవత్సరాల వ్యక్తి ప్రణాలితో 2011లో వివాహం జరిగింది..కాగా వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు సునిల్ తల్లిదండ్రలు సైతం కలిసి జీవిస్తున్నారు. కాగా ఇద్దరు ఓ ప్రవైట్ కంపనీలు ఉద్యోగాలు చేస్తున్నారు.

పడుకున్న భర్తపై 11 కత్తి పోట్లు..

పడుకున్న భర్తపై 11 కత్తి పోట్లు..

ముంబయి తులింజ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం భర్త అక్రమ సంబంధం గురించి భార్యభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. గోడవ అయిన కాసేపటి తర్వాత బార్య,భర్తలు ఇద్దరు బెడ్‌రూంలోకి వెళ్లారు. అనంతరం సునిల్ నిద్రపోయాడు. అయితే అప్పటికే భర్త ప్రవర్తనతో కసిగా ఉన్నా భార్య ప్రణాలి, సాయంత్రం జరిగిన ఘర్షణతో భర్తపై మరింత అవేశంగా ఉంది. దీంతో ప్రణాలి పడుకోకుండా అలోచిస్తూ కూర్చుంది. అప్పుడే భర్తను కడతేర్చాలని భావించింది. అనుకున్నదే తడవుగా మంచినీళ్లు తాగుతానని వంటింట్లోకి వెళ్లిన ఆమే తన వెంట కత్తి పట్టుకొని వచ్చింది. మంచంలో పడుకున్న భర్త కడుపులో కసితో పోడించింది. ఇలా 11 కత్తి పోట్లు పొడిచింది. కత్తితో మెడను కోసి చంపివేసింది... అనంతరం కూల్‌గా లివింగ్ రూంలోకి వచ్చి తన భర్త పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సునిల్ తండ్రితో చెప్పింది.

 పోలీసులకు పిర్యాధు

పోలీసులకు పిర్యాధు

దీంతో కొడుకును కత్తిపోట్లతో చూసిన సునిల్ తండ్రి అనంద్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి పోలీసులు ఆమేను విచారించారు.. ఒక వ్యక్తి తనకు తాను 11 కత్తిపోట్లు పొడుచుకోడని పోలీసులు వివరించారు. ఇక పోలీసుల స్టైల్లో విచారణ జరపడంతో వివాహేతర సంబంధం ఉండడంతోనే తాను తాను హత్య చేసినట్టు ప్రణాలి ఒప్పుకున్నారు. కాగా వారికి తొమ్మిది, ఏడు సంవత్సరాలు ఇద్దరు కూతుళ్లు కూడ ఉన్నారు. పోలీసులకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+