బాలికపై అత్యాచారం, హత్య
కటక్: ఒడిశాలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఒడిశాలోని జాజ్ పూర్ లో కూలిపని చేసుకుని జీవనం సాగించే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కుమార్తె ఉంది. దంపతులు పనికి వెళ్లిన తరువాత బాలిక ఇంటి దగ్గరే ఉంటూ సాటి పిల్లలతో కలిసి ఆడుకునేది.

దంపతులు కూలి పనికి వెళ్లిన తరువాత ఓ కామాంధుడు బాలిక మీద అత్యాచారం చేశాడు. తరువాత బాలిక గొంతు నులిమి బిగించి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర విసిరివేశాడు.
ఇంటికి వచ్చిన దంపతులు కుమార్తె కనపడకపోవడంతో గాలించారు. మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహం పడి ఉన్న తీరు గమనిస్తే అత్యాచారం జరిగిందని వెలుగు చూసిందని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications