Beggar: కోటీశ్వరుడిగా మారిన బిచ్చగాడు.. అదీ యాచించిన సొమ్ముతో..

చాలా మంది బిచ్చగాళ్లను చీప్ గా చూస్తారు. వారికి రూపాయో, రెండు రూపాయలయో వేస్తారు. అయితే చాలా చోట్లు దానం చేసేవాడికంటే.. దానం తీసుకునే వాడు ధనవంతుడిగా మారుతున్నాడు. తాజాగా ఓ బిచ్చగాడు కోటీశ్వరుడిగా అవతారమెత్తాడు. అదీ యాచించిన సొమ్ముతోనే.. ఇది నిజమా అని మీకు డౌట్ రావొచ్చు కానీ ఇది ముమ్మటికీ వాస్తవమే. బిహార్ కు చెందిన పప్పు అనే బిచ్చగాడు తను అడుకున్న డబ్బులతో ధనవంతుడయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పట్నాకు చెందిన పప్పు చిన్నప్పుడు సరిగా చదవ లేదు. దీంతో అతని తండ్రి చదుకోవాలని సూచించాడు. అయినా పప్పు మారకపోవడంతో తండ్రి పప్పుపై చేయి చేసుకున్నాడు. దీంతో తండ్రిపై అలిగిన పప్పు రైలులో పట్నా నుంచి ముంబైకి వచ్చాడు. అయితే అప్పటికి అతనికి చిరిగిన చొక్క(అంగి)తో ఉన్నాడు. ఏం చేయ్యాలో తెలియని పప్పు ముంబై రైల్వే స్టేషన్ లో నిస్సహయుడిగా కూర్చిండి పోయాడు. అయితే అతన్ని బిచ్చగాడిగా భావించిన చాలా మంది ప్రయాణికులు డబ్బులు దానం చేశారు.

A beggar in Mumbai became a millionaire with the money he begged

పప్పుకు ఆ రోజు రూ.3,400 వచ్చాయి. ఇదేదో బాగుందనుకున్న పప్పు తర్వాతి రోజు అదే రైల్వే స్టేషన్ కు వెళ్లి అదే చోట కూర్చున్నాడు. అప్పుడు కూడా పప్పుకు బాగానే డబ్బులు వచ్చాయి. ఇదే పనిగా చేసుకున్న పప్పు యాచించిన డబ్బుతో శ్రీమంతుడిగా ఎదిగాడు. ముంబై నుంచి పాట్నాకు వెళ్లి బిచ్చగాడిగా స్థిరపడ్డాడు. అతను అనేక చోట్ల భూమిని కొన్నాడు. అతని ఇద్దరు పిల్లలు కూడా ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు. పప్పుకు సొంత ఇల్లు కూడా ఉంది.

తన ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్నారని పప్పు చెప్పాడు. యాచించిన సొమ్ముతోనే తన పిల్లలను అధికారులుగా తీర్చిదిద్దుతానని పప్పు గర్వంగా చెబుతోన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+