భార్య టార్చర్ తో నరకం చూస్తున్నాను, బెంగళూరు ఇంజనీరు ఏం చేశాడంటే ?, మొబైల్ లో !
బెంగళూరు/తుమకూరు: మంచి ఉద్యోగం, నెల వస్తే చాలా మంచి జీతం తీసుకుంటూ హ్యాపీగా గడపడానికి అతనికి అవకాశం ఉంది. పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ ఇంజనీరు అనుకున్నాడు. వివాహం చేసుకున్న ఆ ఇంజనీరు తాను జీవితంలో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడు. అయితే అదే భార్య టార్చర్ తట్టుకోలేక ప్రత్యక్షంగా నరకం చూశాడు.
భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేబీ క్రాస్ సమీపంలోని కుందూరు పాళ్యలో చోటుచేసుకుంది. మంజునాథ్ (38) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మంజునాథ్ బెంగళూరులోని బీఎంఆర్ సీఎల్‌లో (నమ్మ బెంగళూరు మెట్రో)లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

కర్ణాటకలోని తురువేకెరెకు చెందిన ప్రియాంకతో మంజునాథ్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. మంజునాథ్, ప్రియాంక దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే చాలా కాలంగా భార్యాభర్తలు అయిన మంజునాథ్, ప్రియాంక తరచూ గొడవలు పడుతున్నారని వారి బంధువులు అంటున్నారు.
పెళ్లయిన తర్వాత భార్య ప్రియాంక తన భర్త మంజునాథ్‌ను మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నువ్వు ఓ పెద్ద పల్లె గెర్రె, నిన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, మా తల్లిదండ్రులు బలవంతంగా నీతో పెళ్లి జరిపించారని, నీతో కాపురం చెయ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రియాంక పదే పదే ఆమె భర్త మంజునాథ్ తో గొడవపడేదని వెలుగు చూసింది.
ఇదే విషయమై దంపతులు మంజునాథ్, ప్రియాంకల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య ప్రియాంక వేధింపులతో మనస్తాపానికి గురైన బెంగళూరు మెట్రో సంస్థలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న మంజునాథ్ తుమకూరు జిల్లాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు మంజునాథ్ అతని సోదరుడికి అతని బార్య ప్రియాంక ఎలా టార్చర్ పెడుతుందో అనే విషయంలో ఓ ఆడియో సందేశం పంపాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
నాకు నా భార్య ప్రియాంకతో కలిసి జీవించడం ఇష్టం లేదు. నా ఇంటిలో నా భార్య ప్రియాంక టార్చర్ తట్టుకోలేక నేను చనిపోతున్నాను. నా పిల్లలను బాగా చూసుకోండి అంటూ మెట్రో ఇంజనీరు మంజునాథ్ అతని సోదరుడికి ఆడియో సందేశం పంపించాడని పోలీసులు అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరు మంజునాథ్ భార్య ప్రియాంకపై తుమకూరు జిల్లాలోని కిబ్బనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మొత్తం మీద భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు మెట్రో ఇంజనీరు ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రియాంకను ఇంకా అరెస్టు చెయ్యలేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications