Chhattisgarh Poll: ఛత్తీస్‌గఢ్‍లో బీజేపీ నాయకుడిని హత్య చేసిన మావోయిస్టులు..
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) లో ఎన్నికలకు ముందు నక్సలైట్లు(Maoists) మరోసారి పంజా విసిరారు. రాష్ట్రంలో అన్ని ఆంక్షలు, భద్రతను ఉన్నప్పటికీ నక్సలైట్లు బీజేపీ నేత రతన్ దూబేను హతమార్చారు. ఈ దాడిని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని తిరుగుబాటు ప్రభావిత నారాయణపూర్ జిల్లాలో బీజేపీ నేత రతన్ దూబేపై ఈ దాడి జరిగిందని, తీవ్ర గాయాలతో అతను మరణించాడని ఆయన తెలిపారు.
కోసల్నార్‌లో బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ సభ్యుడు రతన్ దూబే బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి కౌశల్నార్ గ్రామానికి వెళ్లినప్పుడు మావోయిస్టులు దాడి చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నక్సలైట్లపై పోలీసులు నిఘా పెంచారు.అయినప్పటికీ దాడి జరగడం గమనార్హం.ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ రాజకీయ పార్టీ నేత హత్యకు గురికావడం ఇదే తొలిసారి కాదు.

మొహ్లా-మాన్‌పూర్-అంబగఢ్ చౌకీ జిల్లాలోని ఔంధీ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత గ్రామమైన సర్ఖేడాలో గతంలో బీజేపీ నాయకుడు బిర్జురామ్ తారామ్‌ను కాల్చి చంపారు. దుర్గాపూజ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అతడిపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఈ ప్రాంతంలో దుర్గా విగ్రహ ప్రతిష్టాపనను నక్సలైట్లు వ్యతిరేకించారని చెప్పారు. కానీ బిర్జురామ్ అంగీకరించలేదు, అతను దుర్గా పూజ ప్రారంభించాడు, ఆ తర్వాత అతను నక్సలైట్ల లక్ష్యంగా మారాడు.
ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రం కావడంతో రెండు దఫాలుగా ఇక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు.మొదటి విడత పోలింగ్ నవంబర్ 7 నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్ నవంబర్ 17న నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్ 90 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటిస్తారు. అదే రోజు మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఫలితాలు కూడా రానున్నాయి.












Click it and Unblock the Notifications