గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ వార్నింగ్, రౌడీలు, పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ, ప్రియుడు ఏం చేశాడంటే ?
బెంగళూరు/ కలబురిగి: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ మైనర్లుగా ఉన్న సమయంలోనే ప్రేమలోపడ్డారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రేమికుల లవ్ స్టోరీ మొత్తం ఇరువైపుల కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అంతే రాజకీయ నాయకులు, ఆ ఏరియా రౌడీ షీటర్లు ఎంట్రీ ఇచ్చారు.
ప్రేమించిన యువతి కుటుంబసభ్యుల బెదిరింపులకు భయపడిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని కలబురిగి నగరంలోని బాంబు బజార్ లో చోటుచేసుకుంది. అభిషేక్ మల్లికార్జున బిరాదార అలియాస్ అభిషేక్ (19) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని బుధవారం పోలీసులు తెలిపారు. కలనూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని అభిషేక్ ప్రేమించాడు.

అభిషేక్, ఆ యువతి సుమారు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ప్రియుడి స్నేహితులు అంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఇటీవల అభిషేక్, అతని ప్రియురాలు నిర్ణయించుకున్నారు. దీన్ని యువతి కుటుంబీకులు వ్యతిరేకించారు. ఈ విషయమై యువతి తల్లిదండ్రులు, గ్రామ ఛైర్మన్, కమల్‌నగర్‌కు చెందిన ఓ రౌడీషీటర్ ను కలిసి అభిషేక్‌ను బెదరించాలని చెప్పారు. కమల్‌నగర్ సమీపంలోకి ప్రియుడు అభిషేక్ ను పిలిపించారు.
ఇక ముందు ఆ యువతితో ప్రేమ గీమా అని తిరగకూడదని, ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని అభిషేక్ ను తీవ్రస్థాయిలో బెదిరించారని తెలిసింది. దీంతో తన ప్రేమ విషయంలో ఊరి పెద్దలు. రౌడీలు ఎంట్రీ ఇచ్చారని అభిషేక్ మానసికంగా కుంగిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటగదిలోకి వెళ్లిన అభిషేక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అభిషేక్ ఆత్మహత్యకు యువతి తల్లిదండ్రులు, కలనూర్ గ్రామ చైర్మన్, కమలానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారణమని అభిషేక్ తల్లి రత్నమ్మ, అతని తండ్రి మల్లికార్జున బిరాదార కలబురిగి నగరంలోని చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు, గ్రామస్తులకు భయపడి ప్రియుడు అభిషేక్ ఆత్మహత్య చేసుకోవడం కలబురిగిలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications