ఆంటీతో రొమాన్స్, భర్తకు లిక్కర్ పార్టీ ఇచ్చి స్పాట్ లో సీన్ సిడేల్, చెన్నైలో మేడమ్ !
చెన్నై/తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరువెరుంపూర్ కుమరేశపురం మరియమ్మన్ కోవిల్ వీధికి చెందిన శరవణన్ (45) అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సౌందర్య వల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు పని చేస్తున్నారు. మూడో కూతురు చదువుకుంటున్నది.
శరవణన్, సెలందర్య వల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని సమాచారం. 8 ఏళ్ల క్రితం తిరువెరుంపూర్ ప్రాంతంలోని పంథాల్ కంపెనీలో చేరిన సౌందర్యవల్లి అప్పటి నుంచి అక్కడే పని చేస్తున్నది. అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్ (52)తో సౌందర్యవల్లికి పరిచయం ఏర్పడింది. అప్పటికే భార్యకు విడాకులు ఇచ్చి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటున్న రాధాకృష్ణన్, సౌందర్య వల్లిల స్నేహం చివరకు అక్రమ సంబంధానికి దారితీసింది.

చాలాకాలం పాటు భర్త శరవణన్ కు మ్యాటర్ లీక్ కాకుండా సౌందర్యవల్లి ఆమె ప్రియుడు రాధాకృష్ణన్ తో ఆమె పని చేస్తున్న కంపెనీ గెస్ట్ హౌస్ లో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. సౌందర్యవల్లి స్వర్గం చూపిస్తుండటంతో ఆమెకు ఏం కావాలన్నా రాధాకృష్ణన్ ఇస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శరవణన్ అతని భార్య సౌందరవల్లి, రాధాకృష్ణన్ లను తీవ్రంగా మందలించాడు.
దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత వారం సౌందర్యవల్లి తన చివరి కుమార్తెతో కలిసి చెన్నై వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న శరవణన్‌ను శాంతింపజేయడమే లక్ష్యంగా రాధాకృష్ణన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో భార్య సౌందర్య వల్లితో అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని శరవణన్ అతని భార్య ప్రియుడు రాధాకృష్ణన్‌ను హెచ్చరించాడు.

దీంతో కోపోద్రిక్తుడైన రాధాకృష్ణన్ శరవణ్ తలను గోడకు ఆనించి కత్తితో పొడిచి హత్య చేశాడు. రక్తపుమడుగులో శరవణన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తిరువెరంపూర్ పోలీసులు శరవణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి అన్నల్ మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా శరవణన్‌ను హత్య చేసిన రాధాకృష్ణన్ తిరువెరంపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి రాధాకృష్ణన్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న సౌందర్య వల్లి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే చెన్నై వెళ్లిన సౌందర్య వల్లి ఆమె భర్త శరవణన్ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని శరవణన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications