Virla Video: ఆస్పత్రిలోనే న్యూస్ పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యక్తి..

ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. గుండె పోటు వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి చెందుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి న్యూస్ పేపర్ చదువుతూ కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన పంటి నొప్పితో అతను ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో న్యూస్ పేపర్ చదువుతుండగా కుప్పకూలిపోయాడు.

పంటి నొప్పి

పంటి నొప్పి


అరవై ఏళ్ల దిలీప్ కుమార్ మదానీ పంటి నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో అడుగు పెట్టి అక్కడ ఉన్న న్యూస్ పేపర్ చదువుతున్నాడు. దినపత్రిక చదువుతుండగా.. అతను సడెన్ గా కిందపడిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కార్డియాలజీ

కార్డియాలజీ


క్లినిక్ సిబ్బంది అతడిని కార్డియాలజీ ఆస్పత్రికి తరలించినా దిలీప్ కుమార్ ప్రాణాలను కాపాడలేకపోయారు. దిలీప్ కుమార్ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారి. నవంబర్ 4న బార్మర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. పంటినొప్పి రావడంతో నవంబర్ 5న చికిత్స కోసం క్లినిక్‌కి వెళ్లాడు. అంతకు మునుపు దిలీప్‌ కుమార్‌ బాగానే ఉన్నారని.. అలా కుప్పకూలిపోవడానికి కారణమేంటో తెలియడంలేదని అతడి సోదరుడు మహేంద్ర మదాని చెప్పారు.

ఘజియాబాద్‌


బహుశా గుండెపోటు కావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా బద్మేర్‌కు చేరుకున్నారని.. శనివారమే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. ఇటీవల ఘజియాబాద్‌లో ఓ జిమ్‌ ట్రైనర్‌ కుర్చీలోనే ప్రాణాలు వదిలారు.కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+