రూ కోట్లలో ఆస్తి,భార్యతో బంధువుకు లింక్?, ఆఫీసులో జంట హత్యలు చేసిన భర్త ఏం చేశాడంటే?
కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అయిన వ్యాపారవేత్త అదే ఆస్తి తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మాట్లాడాలని చెప్పిన సమీప బంధువే కాలయముడు అయ్యాడు. సొంత ఆఫీసులో స్నేహితుడితో మాట్లాడుకుంటూ కూర్చున్న వ్యక్తి టీ తాగుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన బంధువు కత్తి తీసి ఇద్దరి ఛాతీపై పొడిచి దారుణంగా హత్య చేసి అదే చోట మినరల్ వాటర్ తాగాడు.
బెంగళూరులో బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జంట హత్యలు జగరడం కలకలం రేపింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదంతో జంట హత్యలు జరిగాయని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులో సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో జంట హత్యలు జరిగాయని, పలు కోణాల్లో కేసు విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు నడిబోడ్డులోని హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంబార పేటలో జంట హత్యలు జరిగాయి.

శ్రీ హరి మార్కెటింగ్ కార్యాలయంలో సురేష్ ( 55), అతని స్నేహితుడు మహేంద్ర (63) అనే వ్యక్తులను దారుణంగా హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ జంట హత్యలు కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదానికి సంబంధించి రిగాయని ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్తి యజమానితో పాటు అతని స్నేహితుడు హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.
సురేష్ కు నిందితుడు భద్ర దూరపు బంధువు అవుతాడు. మడు అంతస్తుల వాణిజ్య భవనం యజమాని అయిన సురేష్ కుమార్ అతని భవనంలోనే శ్రీహరి మార్కెటింగ్ కంపెనీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నాడు. నిందితుడు భద్ర అదే ప్రాంతంలో కుంబార కులానికి సంబంధిన ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. కుంబార కుల సంఘం ట్రస్ట్‌ను నడుపుతున్న భద్రకు ఆకులంలో పెద్దలు, వ్యాపారులతో పాటు అందరితో పరిచయాలు ఉన్నాయి, సురేష్ కూడా కుంబార కులానికి చెందినవాడే.
సురేష్‌కు చెందిన భవనాన్ని తన ట్రస్టుకు రాసివ్వాలని ట్రస్ట్‌ను నడుపుతున్న భద్ర తరచూ అతనితో గొడవపడుతుండేవాడు. అయితే కోట్ల రూపాయల విలువైన మూడు అంతస్తుల భవనం ట్రస్లుకు రాసివ్వడానికి సురేష్ అంగీకరించలేదు. బుధవారం రాత్రి మాట్లాడుకుందామని భద్ర అతని బందువు సురేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. మార్కెటింగ్ ఆఫీస్‌లోకి ప్రవేశించి తన స్నేహితుడు మహేంద్రతో మాట్లాడుతున్న సురేష్ అక్కడు టీ తాగుతున్నాడు. ఆ సమయంలో భద్ర హఠాత్తుగా ఆఫీసులోకి వెళ్లి చేతిలోని కత్తి తీసి సురేష్ ఛాతిపై పొడిచాడు.
స్నేహితుడిని కాపాడుకోవాలని మహేంద్ర భద్రను అడ్డుకున్నాడు. ఆ సందర్బంలో భద్ర అదే కత్తితో మహేంద్ర ఛాతిపై పొడిచేసి ఇద్దరిని స్పాట్ లో చంపేశాడు. జంట హత్యలు చేసిన భద్ర నేరుగా హలాసూర్ గేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ గురువారం మీడియాకు చెప్పారు.
హలాసూరు గేట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుడు భద్ర అతని భార్య విషయంలో బంధువు సురేష్ ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అంటున్నారు. తన భార్యకు, సురేష్ కు అక్రమ సంబంధం ఉందని భద్రకు అనుమానం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జంట హత్యల కేసు పలు కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications