బెంగళూరులో మైనర్ అమ్మాయి పెళ్లి, కేసు పెట్టిన కన్న తల్లి, బంధువులు అందరూ కలిసి ఏం చేశారంటే ?
బెంగళూరులో బాల్యవివాహాలు ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. బెంగళూరు నగర శివార్లలో బాల్య వివాహం జరిగిందని, మైనర్ అమ్మాయికి పెళ్లి చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాలిక కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా బాలిక మేనమామ, అమ్మమ్మ తదితరులు కలిసి ఓ యువకుడితో వివాహం జరిపించేశారు.
బెంగళూరు రూరల్ జిల్లాలో మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగిందని వెలుగు చూడటంతో అధికారులు షాక్ అయ్యారు. మైనర్ ను పెళ్లి చేసుకుని తరువాత ఏమైనా సమస్యలు వస్తే మనకు ఉన్న పలుకుబడి, డబ్బుతో మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్లకు ఇప్పుడు సినిమా కష్టాలు ఎదురైనాయి. బెంగళూరు నగర శివార్లలోని సర్జాపూర్‌లో ఈ ఘటన జరగడంతో వెంటనే వెలుగులోకి రావడంతో బాలిక తల్లి స్వయంగా సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

నా కూతురు ఇంకా మైనర్. నా కూతురికి నచ్చజెప్పి పెళ్లి చేశారు. చింతామణి సమీపంలోని కైవారంలోని యలమ్మ ఆలయంలో తల్లిదండ్రులకు తెలియకుండా బాలికకు పెళ్లి చేశారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. హాసన్ జిల్లా హళేనరసీపురకు చెందిన వినోద్ కుమార్ మైనర్ బాలికను వివాహం చేసుకుని ఆమెను వెంట తీసుకెళ్లాడని బాలిక తల్లి సమాచారం ఇచ్చారని సర్జాపుర పోలీసులు అన్నారు.
వినోద్ కుమార్ తో పాటు అతని తండ్రి మునియప్ప, తల్లి రత్నమ్మ, వినోద్ కుమార్ సోదరుడు విజయ్ కుమార్, మునియప్ప, వెంకటమ్మలు కలిసి మైనర్ అమ్మాయిని బలవంతంగా వివాహం చేశారని ఆరోపణలు ఉన్నాయి, నా కూతురు మైనర్ అని తెలిసి కూడా బలవంతంగా పెళ్లి చేశారని, ఈ అక్రమ వివాహం చేసిన అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేసిన మైనర్ పెళ్లి చేసిన వారి కోసం గాలిస్తున్నామని, అందరూ తప్పించుకున్నారని బెంగళూరు నగర శివార్లలోని సర్జాపుర పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications