Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొలిటికల్ పంచ్, నిన్న రాసలీల కేసు, నేడు బ్యాంకులో ?, రూ. వందల కోట్ల కేసు సీఐడీకి!

బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి మీద బెంగళూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ 420 కేసును సీఐడీకి బదిలీ చెయ్యడం ఇప్పుడు కలకలం రేపింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మీద నమోదు అయిన చీటింగ్ కేసును సీఐడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

బ్యాంకులో తీసుకున్న రుణం ఇప్పటి వరకు తిరిగి చెల్లించకపోవడంతో కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి కష్టాలు తప్పడంలేదు. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి మీద కేసు నమోదు అయ్యింది. సౌభాగ్యలక్ష్మి షుగర్స్ లిమిటెడ్ పేరు మీద మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఆ కంపెనీకి చెందిన వసంత్ వి పాటిల్, శంకర్ పావాడేపై బెంగళూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

A cheating case has been registered against the former minister for taking a loan of hundreds of crores from the bank

ఈ కేసులో ఏ1 నిందితుడు మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కావడం విశేషం, రమేష్ జారకిహోళి మీద ఐపీసీ 420 సెక్షన్ కింద అపెక్స్ బ్యాంక్ మేనేజర్ రాజన్న ఫిర్యాదు చెయ్యడంతో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఇదే కేసు ఇప్పుడు బెంగళూరు పోలీసుల చేతి నుంచి సీఐడీ పోలీసు అధికారుల చేతికి వెళ్లిపోయింది. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కేసును ఇప్పుడు సీఐడీకి అప్పగించడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గోకాక్‌లోని సౌభాగ్య లక్ష్మి షుగర్స్ లిమిటెడ్ కంపెనీ స్థాపన, విస్తరణ మరియు నిర్వహణ కోసం కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, చామరాజ్‌పేట, బెంగళూరు నుండి కంపెనీ పేరు మీద రుణం తీసుకున్నారు. 2013 నుంచి 2017 వరకు మొత్తం రూ 232 కోట్లా 88 లక్షల రుణాలు ఆ కంపెనీ పేరుతో మంజూరు అయ్యిందని సమాచారం. కానీ ఇంతవరకు రుణం చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి.

2023 నాటికి ఆ రుణం రూ 439 కోట్లా 7 లక్షలకు చేరడంతో ఆ రుణం బ్యాంకుకు చెల్లించలేదని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తదితరుల మీద ఆరోపణలు ఉన్నాయి. రుణం ఇచ్చే సమయంలో బోర్డు డైరెక్టర్‌ను మార్చకూడదనే షరతుతో బ్యాంకు రుణం ఇచ్చింది. అయితే తాజాగా బోర్డు డైరెక్టర్‌ని మార్చారని బ్యాంకు అధికారులు అంటున్నారు. బ్యాంకుకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి.

కంపెనీ మేనేజ్‌మెంట్ బోర్డు పదవులను వదిలిపెట్టి నమ్మక ద్రోహం చేశారంటూ బ్యాంక్ మేనేజర్ రాజన్న బెంగళూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, ముగ్గురు కార్యాలయ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. బ్యాంకులను మోసం చేసే ఉద్దేశ్యంతో ప్రవర్తించారని ఆరోపిస్తూ వీవీ పురం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణతో రమేష్ జారకిహోళి మరోసారి చిక్కుల్లో పడినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+